ఇప్పుడు ఉబెర్ క్యాబ్‌లను బుక్ చేసుకోవడం చాలా సులభం

|

ప్రపంచం మొత్తం మీద ఉబెర్ క్యాబ్‌లను బుక్ చేసుకోవడానికి ఇదివరకు ఉబెర్ యాప్ లను ఉపయోగించారు. భారతదేశంలో తన ప్లాట్‌ఫామ్‌లో క్యాబ్‌లను బుక్ చేసే విధానాన్ని ఇప్పుడు మరింత సరళీకృతం చేయాలని ఉబెర్ కోరుకుంటోంది. కెన్-షేరింగ్ ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారులను ఇప్పుడు స్థానిక భాషలలో ఫోన్ కాల్స్ మరియు SMS ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతించాలని అనుకుంటున్నది.

uber testing call and sms based cab booking in india

పాత తరానికి చెందిన వారికి కూడా ఉబెర్‌ క్యాబ్‌లను పొందడం సులభతరం చేయడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు 4G కనెక్షన్ మరియు ఇంటర్నెట్ సదుపాయం లేని సమయంలో ఇరుక్కున్నప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు క్యాబ్ బుక్ చేసుకోవడానికి రైడర్స్ కోసం కంపెనీ యొక్క కాల్ సెంటర్‌ను ఆశ్రయించినచో కంపెనీ పైలట్ మీకు తగిన సమాచారం ఇవ్వగలడు మరియు మీరు క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాడు. ఉబెర్ యాప్ సర్వీస్ ప్రారంభించిన తర్వాత ఉబెర్ ఆఫ్‌లైన్ బుకింగ్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి.

ఫోన్ కాల్ మరియు SMS ఆదారంగా ఉబెర్ బుకింగ్:

ఫోన్ కాల్ మరియు SMS ఆదారంగా ఉబెర్ బుకింగ్:

ఖర్చులను తగ్గించడానికి ఉబెర్ ఇప్పటివరకు కాల్ సెంటర్ ఆధారిత బుకింగ్ వ్యవస్థను తప్పించింది. అయితే ఇప్పుడు ప్రాంతీయ కస్టమర్లను ఆకర్షించడానికి స్థానిక కాల్ సెంటర్ల ఏర్పాటులో నిమగ్నమవ్వడానికి ఉబెర్ సిద్ధమవుతోంది. రవాణా నెట్‌వర్క్ సంస్థ డ్రైవర్ల కోసం కాల్ సెంటర్‌ను ఓపెన్ చేసింది.ఇందులో అత్యవసర పరిస్థితులకు సంబందించిన ఆపరేషన్‌ను కూడా కలిగి ఉంది. రైడర్ యాప్ లోని SOS బటన్‌ను నొక్కితే చాలు ఫోన్ కాల్ తిరిగి మళ్ళి వస్తుంది. యాప్ ని నావిగేట్ చేయలేకపోతున్న మరియు ఆన్‌లైన్ బుకింగ్ చేయలేని వారికి ఈ కొత్త ప్లాన్ చాలా బాగా సహాయపడుతుంది.

 కాల్ సెంటర్ సదుపాయం:

కాల్ సెంటర్ సదుపాయం:

దేశంలో ఉబెర్ యొక్క అతిపెద్ద ప్రత్యర్థి ఓలా కంపెనీ. ఇది భారతదేశంలో కాల్ సెంటర్ నంబర్‌తో కార్యకలాపాలు ప్రారంభించారు. ఉబెర్ దేశంలోకి ప్రవేశించినప్పుడు కార్యకలాపాల సామర్థ్యంపై దృష్టి పెట్టడానికి ఈ సదుపాయాన్ని మూసివేసింది. ఉబెర్ ఇప్పుడు దేశంలోని స్థానిక ప్రత్యర్థి నుండి సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉబెర్ ఉపయోగించని కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ఎంపికను తీసుకువస్తున్నట్లు ఉబెర్ తెలిపారు. నెట్‌వర్క్‌కు కాల్‌లు మరియు ఎస్‌ఎంఎస్‌లను జతచేస్తున్నందున దాని కాల్ సెంటర్ ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోవాలని కంపెనీ కోరుకుంటున్నది.

ఉబెర్ మార్కెట్:
 

ఉబెర్ మార్కెట్:

వెంచర్ క్యాపిటల్ సంస్థల డార్లింగ్‌గా మారిన ఉబెర్ లాభదాయకంగా మారడానికి చాలా కష్టపడింది. సంస్థ ఇటీవలే జాబితా చేసిన దాని ప్రకారం కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. కానీ ఇప్పుడు దీనికి మద్దతు బాగా లభించింది. ఉబెర్ యొక్క మార్కెట్ 75 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంటుందని అంచనా. కానీ ఇది మునుపటి అంచనా $ 100 బిలియన్ల కంటే చాలా తక్కువ. తన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి ఉబెర్ మరిన్ని స్టాండర్డ్ ఎంపికలను జోడించాలని చూస్తోంది. ఏదేమైనా భారతదేశం వంటి మార్కెట్లలో బుకింగ్ సరళీకృతం చేయడం వలన డివిడెండ్ మరియు డిమాండ్ పెరుగుతుంది అన్న ఆలోచనలో ఉంది .

Best Mobiles in India

English summary
uber testing call and sms based cab booking in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X