రూ.303కే 30జీబి డేటా, మార్చి 31 తరువాత ప్లాన్స్

రిలయన్స్ జియో ఉచిత సర్వీసును మార్చి 31, 2017తో నిలిపివేస్తున్నట్లు రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు. ఉచిత ఆఫర్లు ముగిసినప్పటికి జియో చవకైన నెట్‌వర్క్‌గానే అందుబాటులో ఉంటుందని అంబానీ స్పష్టం చేసారు.

Read More : నోకియా 8 అమ్మకాలు ప్రారంభం, ధర ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెర పైకి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌

మార్చి 31లోపు జియో యూజర్లు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకుకోవటం ద్వారా రూ.303కే 30జీబి డేటాను పొందే వీలుంటుందని అంబానీ తెలిపారు.  జియో ప్రైమ్ సభ్యత్వం అనేది మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది.

మార్చి 31, 2018 వరకు..

జియో ప్రైమ్ సభ్యత్వం మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది. ప్రైమ్ యూజర్లు
ప్రతినెలా రూ.303 చెల్లించిటం ద్వారా మార్చి 31, 2018 వరకు జియో న్యూ ఇయర్ ఆఫర్ తాలుకూ అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

రోజుకు ఒక జీబి డేటా..

ప్రతి నెలా లభించే 30జీబి డేటాను రోజుకు ఒక డేటా చొప్పున నెలమొత్తం వాడుకోవచ్చని, ఇదే సమయంలో వాయిస్ కాల్స్‌తో జియో యాప్ సూట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని అంబానీ స్పష్టం తెలిపారు.

ముఖేష్ అంబానీ వెల్లడించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..

జియో కస్టమర్ బేస్ దేశవ్యాప్తంగా 10 కోట్లు దాటినట్ల అంబానీ తెలిపారు. విడుదల నాటి నుంచి జియో నెట్‌వర్క్ ద్వారా 200 కోట్ల నిమిషాలకు పైగా వాయిస్ అలానే వీడియో కాల్స్‌ను జియో యూజర్లు నిర్వహించుకున్నారు. ఇదే సమయంలో 100 కోట్ల gigabytes డేటాను కూడా జియో యూజర్లు వినియోగించుకున్నారు. 170 రోజుల పాటు ప్రతి సెకనుకు 7 కొత్త కస్టమర్‌లు యాడ్ అయ్యారు.

170 రోజుల్లో 10 కోట్ల యూజర్లు

కేవలం 170 రోజుల వ్యవధిలోనే 100 మిలియన్ యూజర్లు జియో 4G LTE నెట్ వర్క్ సంపాదించుకోగలిగింది. జియో నెట్‌వర్క్‌లో రోజుకు 5.5కోట్ల గంటల నిడివి గల వీడియోలను వీక్షిస్తున్నారు.జియో రాకతో మొబైల్ ఇంటర్నట్ వినియోగంలో భారత్ నెం.1 స్ధానానికి చేరుకుందిని అంబానీ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Unlimited daily data at Rs 10, Jio big Announcements. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot