స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!

By Maheswara
|

ఈ రోజుల్లో షాపింగ్ కోసం అనేక ఇ-కామర్స్ సైట్‌లు ప్రధాన హైలైట్‌గా మారాయి. వీటిలో ఒక్కొక్కటిగా పండగ సందర్భాల కోసం అనేక ఆఫర్లు మరియు ప్రత్యేక రోజులలో మరిన్ని ఆఫర్లు అందిస్తుంటాయి. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కొన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అధిక ఆఫర్లను ప్రకటించాయి. అందులోనూ విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్ పేరుతో రిపబ్లిక్ డే సందర్భంగా సేల్ ఆఫర్లను ప్రకటించింది.

 

విజయ్ సేల్స్ ఆన్‌లైన్

అవును, విజయ్ సేల్స్ ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్, రిపబ్లిక్ డేలో భాగంగా మెగా రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కంపెనీ ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.

విజయ సేల్ యొక్క మెగా రిపబ్లిక్ డే సేల్‌

విజయ సేల్ యొక్క మెగా రిపబ్లిక్ డే సేల్‌

దీనితో పాటు, కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ క్రెడిట్ / డెబిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే, అదనపు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విజయ సేల్ యొక్క మెగా రిపబ్లిక్ డే సేల్‌లో, Samsung Galaxy Tab A7 Lite, Samsung Galaxy A23, OnePlus 10R, Galaxy Buds 2 పరికరాలపై ఆఫర్‌లు దృష్టిని ఆకర్షించాయి. దీని గురించి మరింత పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Samsung Galaxy A23 ఫోన్ పై ఆఫర్ వివరాలు
 

Samsung Galaxy A23 ఫోన్ పై ఆఫర్ వివరాలు

విజయ సేల్స్‌లో Samsung Galaxy A23 స్మార్ట్‌ఫోన్ రూ. 18,499 కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు ఆండ్రాయిడ్ 12-ఆధారిత One UI 4.1పై రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీ ను కూడా కలిగి ఉంది. ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Samsung Galaxy Tab A7 Lite

Samsung Galaxy Tab A7 Lite

విజయ సేల్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ టాబ్లెట్ రూ.9,999 వద్ద ఆకర్షణీయమైన ఆఫర్‌ తో  అందిస్తోంది. ఈ పరికరంను కొనుగోలు చేయడానికి మీకు ప్రస్తుతం అందుబాటులో ఉంది 1,340 x 800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్ సామర్థ్యం గల 8.7-అంగుళాల WXGA+ (లు) TFT డిస్‌ప్లే కూడా ఉంది. అలాగే ఈ టాబ్లెట్‌లో MediaTek Helio P22T SoC ప్రాసెసర్ ఉంది. ఇది One UI కోర్ 3.1తో Android 11 తో పని చేస్తుంది. ఇది 3GB RAM మరియు 32GB స్టోరేజీ మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజీ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 5,100mAh కెపాసిటీ బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్

OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్

విజయ సేల్స్ నిర్వహిస్తున్న ఈ మెగా రిపబ్లిక్ డే సేల్‌లో OnePlus 10R 5G ఫోన్‌ రూ.32,999 వద్ద తగ్గింపు ఆఫర్ తో లభిస్తోంది. ఈ ఫోన్ 1,080 x 2,412 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8100 Max SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 12.1 సపోర్ట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4,500mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ కూడా ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Vijay Sales Republic Day Offers: Huge Discount Offers On Smartphones,Tablets And Other Electronic Gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X