పుల్వామా దాడి వెనుక సిమ్‌ల రహస్యం , అమెరికా వర్చువల్‌ సిమ్‌లు ?

40 మంది భారత సైనికులను నిలువునా పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడి గురించి యావత్ భారతం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు మన సైన్యం కంటే వేగంగా అప్ గ్రేడ్ అ

|

40 మంది భారత సైనికులను నిలువునా పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడి గురించి యావత్ భారతం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు మన సైన్యం కంటే వేగంగా అప్ గ్రేడ్ అయి అత్యాధునిక టెక్నాలజీని వాడారని వార్తలు వస్తున్నాయి. ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈ మధ్యనే కారును ఎలా పేల్చాలి, అది ఎంత పెద్దగా పేలాలి అనే దాన్ని డిసైడ్ చేసేందుకు ఉగ్ర నిపుణులు ఇండియాలోకి వచ్చారని తెలుసుకున్నారు.

పుల్వామా దాడి వెనుక సిమ్‌ల రహస్యం , అమెరికా వర్చువల్‌ సిమ్‌లు ?

అయితే ఈ వార్తను జీర్ణించుకోక ముందే మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదే అమెరికా వర్చువల్‌ సిమ్‌ల వ్యవహారం. పూర్తి వివరాల్లోకెళితే...

వర్చువల్ సిమ్‌లు

వర్చువల్ సిమ్‌లు

ఈ దాడి కోసం ఉగ్రవాదులు వర్చువల్ సిమ్‌లు వాడారని రిపోర్టులు తెలియజెబుతున్నాయి. 2008లోనే ఉగ్రవాదులు ఈ టెక్నాలజీ వాడినా... అప్పట్లో మన సైన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి సిమ్‌లే వాడటంతో... వాటిలో ఏ డేటా ఉంది అన్నది తెలుసుకోవడం మనకున్న టెక్నాలజీతో సాధ్యం కావట్లేదు.

అమెరికాకు భారత్‌ విజ్ఞప్తి

అమెరికాకు భారత్‌ విజ్ఞప్తి

ఇందులో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో ముష్కరులు అమెరికా వర్చువల్‌ సిమ్‌లు వాడారని, వాటి సర్వీస్‌ ప్రొవైడర్‌ తాలూకు వివరాలు ఇవ్వాలని అమెరికాకు భారత్‌ విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు అధికారులు తెలిపారు.

ఉగ్ర నాయకులతో ఎప్పటికపుడు టచ్‌లో..

ఉగ్ర నాయకులతో ఎప్పటికపుడు టచ్‌లో..

వర్చువల్‌ సిమ్‌ను వినియోగిస్తూ ఫిదాయు ఆదిల్‌ దార్‌ జైషే ఉగ్ర నాయకులతో ఎప్పటికపుడు టచ్‌లో ఉన్నాడని అధికారుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. అమెరికాలోని సర్వీస్‌ ప్రొవైడర్‌ అందించే ఇటువంటి సిమ్‌లను ఉపయోగిస్తూనే ఉగ్రవాదులు సరిహద్దుల్లో కుట్రలు పన్నారని, పథకాలు అమలు చేశారని అధికారులు తెలిపారు.

వర్చువల్‌ సిమ్‌ అంటే?

వర్చువల్‌ సిమ్‌ అంటే?

ఇది మనం మొబైళ్లలో వేసుకునే సిమ్ కాదు. అసలిక్కడ సిమ్ అనేదే ఉండదు. ఈ టెక్నాలజీలో కంప్యూటర్‌ ఒక టెలిఫోన్‌ నంబర్‌ను జనరేట్‌ చేస్తుంది. అంటే అమెరికాలో కంప్యూటర్లలో అలాంటి నంబర్లు ఇస్తారు. అందువల్ల సిమ్ కార్డుతో పనుండదు.

ఆన్‌లైన్‌లో వర్చువల్ సిమ్

ఆన్‌లైన్‌లో వర్చువల్ సిమ్

మనకు ఇచ్చిన నంబర్‌ను మనం మొబైల్ నంబర్‌లా వాడుకోవాలంటే... ఆ సర్వీస్ ప్రొవైడర్ యాప్‌ని మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రాం, ట్విటర్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లతో ఈ నంబర్‌ను అనుసంధానం చేస్తారు. అప్పుడు మనకు ఓ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని ఆ యాప్‌లో ఎంటర్ చెయ్యాలి. అంతే... ఆన్‌లైన్‌లో వర్చువల్ సిమ్ పనిచెయ్యడం మొదలుపెడుతుంది.

నంబర్ల ముందు +1 ఉందంటే

నంబర్ల ముందు +1 ఉందంటే

మొబైల్ నంబర్ల ముందు +1 ఉందంటే అది వర్చువల్ సిమ్ నుంచీ వచ్చిన కాల్ గా అర్థం చేసుకోవాలి. ఇలాంటి కాల్స్ అమెరికాలో కామన్ అవుతున్నాయి.

అమెరికా ప్రజలు కూడా

అమెరికా ప్రజలు కూడా

ది మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డైరెక్టరీలో ఇలాంటి నంబర్లు ఉంటాయి. ఇలాంటి నంబర్లతో వచ్చిన కాల్స్ అన్నీ ఉగ్రవాదుల నుంచే వస్తున్నాయని అనుకోవాల్సిన పనిలేదు. అమెరికా ప్రజలు కూడా వర్చువల్ సిమ్‌లు వాడుతున్నారు.

 

 

Best Mobiles in India

English summary
Virtual SIMs used in Pulwama terror attack; India to approach US for help

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X