WhatsApp సెక్యూరిటీ కొత్త అప్‌డేట్!! లాగిన్ మరింత సురక్షితం...

|

సోషల్ మీడియా యాప్ లను వినియోగించడం ప్రస్తుత రోజులలో అధికమవుతున్నది. వాట్సాప్ రాకతో సోషల్ మీడియా యాప్ లు కొత్త ఒరవడితో అందుబాటులోకి తీసుకొనివచ్చాయి. విదేశాలలో ఉన్న వారితో కూడా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఇంటర్నెట్ సాయంతోనే వీడియో మరియు ఆడియో కాల్స్ మాట్లాడడానికి అనుమతిని ఇస్తున్నది. వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్లలో వాట్సాప్ బీటా యొక్క కొత్త అప్డేట్ వెర్షన్ తో అకౌంటులోకి లాగిన్ చేయడానికి ముందు అదనపు భద్రతను జోడించే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

 

WABetaInfo

WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది.

WhatsApp లో డిలీట్ చేసిన మెసేజ్ లను తెచ్చుకోవడానికి కొత్త ఫీచర్.WhatsApp లో డిలీట్ చేసిన మెసేజ్ లను తెచ్చుకోవడానికి కొత్త ఫీచర్.

వాట్సాప్
 

"ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.

BSNL 5G కోసం స్పెక్ట్రమ్‌లో భారీ కేటాయంపు?? 2023 లో అందుబాటులోకి...BSNL 5G కోసం స్పెక్ట్రమ్‌లో భారీ కేటాయంపు?? 2023 లో అందుబాటులోకి...

వాట్సాప్ బీటా వెర్షన్

ఆండ్రాయిడ్, iOS మరియు డెస్క్‌టాప్ యొక్క వాట్సాప్ బీటా వెర్షన్ లలో టెక్స్ట్ మెసేజ్‌లను ఎడిట్ చేసే సామర్థ్యాన్ని తీసుకురావడం కోసం వాట్సాప్ పని చేస్తోంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్‌పై 5 సంవత్సరాల క్రితం పని చేయడం ప్రారంభించిందని నివేదికలో భాగస్వామ్యం చేసిన స్క్రీన్‌షాట్ సూచిస్తుంది. టెక్స్ట్‌ని ఎడిట్ చేయడానికి మీరు టెక్స్ట్‌ని ఎంచుకోవాలి మరియు కాపీ మరియు ఫార్వర్డ్‌తో పాటు పాప్ అప్ అయ్యే ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని వెల్లడిస్తుంది. ఈ ఫీచర్‌తో మీరు పంపిన టెక్స్ట్ లో ఏవైనా అక్షరదోషాలు లేదా ఇతర లోపాలు ఉంటే కనుక సరిచేయవచ్చు. అయితే ఇతర టెక్స్ట్ మెసేజ్ల వలె కాకుండా మీరు ఎడిట్ చేసిన టెక్స్ట్ ని తొలగించలేరు.

వాట్సాప్‌లోని డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందే విధానం

వాట్సాప్‌లోని డిజిలాకర్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందే విధానం

** వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను పొందడానికి మీరు చేయవలసిన మొదటి పని డిజిలాకర్ అకౌంట్ కోసం సైన్ అప్ చేయడం. మీరు ఇప్పటికే సైన్ అప్ అయిఉంటే కనుక డాక్యుమెంట్లను పొందడం సులభం అవుతుంది.

** MyGov చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు 'నమస్తే' లేదా 'హాయ్' అని డిజిలాకర్ వాట్సాప్ నంబర్ +91 9013151515కు పంపాలి.

** మీరు 'డిజిలాకర్'కి మెసేజ్ పంపిన వెంటనే "మీ డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి/ఇష్యూ చేయడానికి డిజిలాకర్ సేవలకు స్వాగతం" అని మీకు ప్రతిస్పందన వస్తుంది.

** తరువాత మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని అడుగుతారు. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక వారి ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని వినియోగదారున్ని అడుగుతుంది. మీరు అలా చేసిన తర్వాత మీరు మీ నమోదిత మొబైల్ పరికరంలో OTPని పొందుతారు.

** మీరు OTPని నమోదు చేసిన తర్వాత మీరు మీ డిజిలాకర్ అకౌంటులో అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్లు లేదా ఏదైనా ఎంపిక చేసిన ఒక డాక్యుమెంట్ ని డౌన్‌లోడ్ చేసుకోగలరు.

Best Mobiles in India

English summary
WhatsApp Brings Another Verification Code as Part of a New Security Update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X