మరోసారి అప్రమత్తమైన వాట్సాప్

వాట్సప్‌లో తలెత్తిన ఓ ప్రైవసీ సమస్యను ఆ సంస్థ పూర్తిగా పరిష్కరించినట్లు తెలుస్తోంది.

|

వాట్సప్‌లో తలెత్తిన ఓ ప్రైవసీ సమస్యను ఆ సంస్థ పూర్తిగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ వీడియో కాల్స్‌లో వినియోగించే రియల్-టైమ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోటోకాల్‌ను మొమురీ కరెప్షన్ బగ్ అనే మాల్వేర్ సహాయంతో దెబ్బతీయగలిగిన హ్యాకర్లు వీడియో కాల్స్ ద్వారా యూజర్ యాప్‌లలోకి చొరబడుతున్నారు.

వేరువేరు అప్‌డేట్‌లను రిలీజ్ చేసిన వాట్సాప్..

వేరువేరు అప్‌డేట్‌లను రిలీజ్ చేసిన వాట్సాప్..

ఈ సమస్యను ముందుగా గూగుల్ ప్రాజెక్ట్ జీరోకు చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ ఒకరు గుర్తించారు.ఆగష్టులో వెలుగు చూసిన ఈ బగ్ ఐపీ నెట్‌‌వర్క్స్ పై ఎక్కువగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల ఎన్ని అకౌంట్లు ప్రమాదానికి గురుయ్యాయన్న విషయం పై ఇంకా స్పష్టమైన క్లారిటీ లేదు. సమస్యను పరిష్కరించే క్రమంలో ఆండ్రాయిడ్ అలానే ఐఓస్ వెర్షన్‌లకు సంబంధించి రెండు వేరువేరు అప్‌డేట్‌లను వాట్సాప్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది..

అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది..

ఆండ్రాయిడ్ వెర్షన్‌కు సంబంధించిన అప్‌టేడ్ సెప్టంబర్ 28న లాంచ్ అవ్వగా, ఐఓఎస్ వెర్ష‌న్‌కు సంబంధించిన అప్‌డేట్ అక్టోబర్ 3న సంబధిత యాప్ స్టోర్స్‌లో వాట్సాప్ లాంచ్ చేసినట్లు ZDNet తెలిపింది. ఈ అప్‌డేట్‌లకు సంబంధించి వాట్సాప్ అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది.

సెక్యూరిటీ సమస్యల్లో ఫేస్‌బుక్..

సెక్యూరిటీ సమస్యల్లో ఫేస్‌బుక్..

వాట్సాట్ పేరెంట్ కంపెనీ అయిన ఫేస్‌బుక్ కూడా సెక్యూరిటీ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సైట్‌‌లోకి చొరబడిన గుర్తుతెలియని హ్యాకర్లు ఏకంగా 5 కోట్ల అకౌంట్‌లకు సంబంధించిన డేటాను బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ పై జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి ఇదే అని సెక్యూరిటీ రిసెర్చర్స్ విశ్లేషిస్తున్నారు. ఫేస్‌బుక్ "View as" ఫీచర్‌లోని చిన్న లూప్ హోల్‌ను ఆధారంగా చేసుకుని విజృంభించిన హ్యాకర్లు, ఈ ఫీచర్‌కు సంబంధించిన సెక్యూరిటీ టోకెన్లను తమ ఆధీనంలోకి తీసుకోగలిగారు.

ఇతరులు ఏ విధంగా చూడగలగుతారో..

ఇతరులు ఏ విధంగా చూడగలగుతారో..

తద్వారా ఇతరుల అకౌంట్లకు సంబంధించిన డేటాను వీరు యాక్సిస్ చేసుకోగలిగారు. వాస్తవానికి, ఫేస్‌బుక్ "View as" ఫీచర్‌ను ఉపయోగించుకుని మన ప్రొఫైల్‌ను ఇతరులు ఏ విధంగా చూడగలగుతారో తెలుసుకునే వీలుంటుంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ టర్నాఫ్ చేసినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
WhatsApp fixes bug that let hackers break into video calls.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X