వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్తగా మరొక ఫీచర్!! ఏ మెసేజ్ నైనా తొలగించడానికి అనుమతి

|

మెటా - యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క వినియోగదారులకు తరచూ కొత్త కొత్త అప్‌డేట్లను విడుదల చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నది. ఇటీవల iOS అప్‌డేట్ కోసం దాని తాజా బీటాలో తొలగించబడిన మెసేజ్లను తిరిగి పొందగలిగే సామర్థ్యాన్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు కొత్తగా గ్రూప్ అడ్మిన్‌ల కోసం మరొక కొత్త ఫీచర్ ని విడుదల చేసింది. వాట్సాప్ గ్రూప్ యొక్క అడ్మిన్ గ్రూప్‌లోని ఏదైనా మెసేజ్ ని తొలగించడానికి అనుమతిస్తూ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్తగా వచ్చే ఈ ఫీచర్ కొంతమంది లక్కీ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందించబడింది. కాబట్టి ఇది అన్ని ఇతర అకౌంటులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది అని WABetaInfo నివేదించింది. "మీరు గ్రూప్ అడ్మిన్ అయితే కనుక మీ గ్రూపులో పాల్గొనేవారి నుండి వచ్చిన మెసేజ్లను తొలగించలేకపోతే కనుక దయచేసి భవిష్యత్ అప్‌డేట్ కోసం వేచి ఉండండి. ఎందుకంటే రాబోయే వారాల్లో మరిన్ని యాక్టివేషన్‌లు అనుసరించబడతాయి" అని నివేదిక పేర్కొంది.

వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు ఇది ముఖ్యమైన ఫీచర్ అని నివేదిక పేర్కొంది. ఎందుకంటే అడ్మిన్ లు చివరకు వారి వాట్సాప్ గ్రూపులను మెరుగ్గా మోడరేట్ చేయడానికి వీలును కల్పిస్తుంది. అదనంగా గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ ని తొలగించబడినప్పుడు ఇతర గ్రూప్‌లో పాల్గొనే వారందరూ కూడా నిర్దిష్ట మెసేజ్ ని గ్రూప్ అడ్మిన్ తొలగించినట్లు చూడగలరు.

వాట్సాప్ చాట్ జాబితా
 

ఇటీవల iOS వినియోగదారుల కోసం వాట్సాప్ చాట్ జాబితా నుండి నేరుగా స్టేటస్ ని చూసే సామర్థ్యాన్ని తన ప్లాట్‌ఫారమ్ లో ప్రారంభించింది. బీటా వెర్షన్ 22.18.0.70 చాట్ లిస్ట్‌లో స్టేటస్ అప్‌డేట్‌లను వీక్షించే సామర్థ్యాన్ని అందిస్తోంది. ఇది నిర్దిష్ట బీటా పరీక్షకులకు విడుదల చేయబడింది. కావున ఈ కొత్త ఫీచర్ ఇప్పటికీ అందరికీ అందుబాటులో లేదు.

వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్

వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్

WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది.

వాట్సాప్ చాట్‌బాట్ ఫీచర్‌

వాట్సాప్ చాట్‌బాట్ ఫీచర్‌

వాట్సాప్ వాచ్‌డాగ్ WABetaInfo ప్రకారం వాట్సాప్ యాప్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొనివచ్చే చాట్‌బాట్ యొక్క అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. పబ్లికేషన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం వాట్సాప్ యాప్‌లో కొత్త వెరిఫైడ్ చాట్‌బాట్ ఉంటుందని చూపిస్తుంది. ఈ చాట్‌బాట్ వారి సంభాషణ జాబితాలో ఉన్న వ్యక్తులలో మొదటి స్థానంలో ఉంటుంది. " ఈ చాట్‌బాట్ కొత్త కొత్త ఫీచర్‌ల గురించి తెలియజేయడం, చిట్కాలు మరియు ట్రిక్‌లను తెలపడం మరియు ప్రైవసీ మరియు భద్రతకు సంబందించిన అన్ని రకాల వివరాలను అందిస్తుంది." స్క్రీన్‌షాట్ ప్రకారం చాట్‌లో పంపిన అన్ని మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. అయితే ప్రత్యుత్తరాలకు మద్దతు ఇవ్వనప్పటికీ మెసేజ్లు ఒకేసారి చాలా మంది వినియోగదారులకు ప్రసారం చేయబడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఒకవేళ మీకు వాట్సాప్ చాట్‌బాట్ నుండి మెసేజ్ లను స్వీకరించకూడదు అని మీరు భావిస్తే కనుక అకౌంటును బ్లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికీ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాబట్టి బీటా ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి మరియు ఎంపిక చేసిన వినియోగదారులకు ఇది కనిపించవచ్చు. వాట్సాప్ దీన్ని స్థిరమైన ఛానెల్‌కు ఎప్పుడు విడుదల చేస్తుందనే దాని గురించి సరైన సమాధానం లేదు.

Best Mobiles in India

English summary
WhatsApp New Feature: Access to Admin to Delete Any Message in Group Chat

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X