కొత్త విండోస్ వ‌చ్చేస్తోంది.. Windows 12 ఓఎస్ విడుద‌ల ఎప్పుడంటే!

|

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం Microsoft త్వ‌ర‌లోనే Windows OS కొత్త అప్‌డేట్ తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విండోస్ సెంట్ర‌ల్ నివేదిక‌ తాజాగా కీల‌క స‌మాచారాన్ని వెల్ల‌డించాయి. 2024 సంవ‌త్స‌రంలో Microsoft కంపెనీ నుంచి Windows 12 OS అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నివేదిక పేర్కొంది.

 
కొత్త విండోస్ వ‌చ్చేస్తోంది.. Windows 12 ఓఎస్ విడుద‌ల ఎప్పుడంటే!

ఇంకా చాలా మంది Windows 10 OS ని ఉప‌యోగిస్తున్నారు!
Microsoft సంస్థ గతేడాది కొత్త Windows 11 OS ను అందుబాటులోకి తెచ్చిన‌ విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ చాలా మంది యూజ‌ర్లు 2015లో విడుద‌లైన Windows 10 OS నే ఉప‌యోగిస్తున్నారు. Windows 11 OS విడుద‌లై ఏడాది గ‌డుస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం 10 సిస్ట‌మ్స్ కు గాను కేవ‌లం రెండింటిలో మాత్ర‌మే దాన్ని ఉప‌యోగిస్తున్నార‌ని అంచ‌నా. ఇప్ప‌టికీ ఇంకా చాలా మంది యూజ‌ర్లు Windows 11 OS కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ మ‌రో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. Windows 11 OS ను రిప్లేస్ చేస్తూ కొత్త ఫీచ‌ర్ల, కొత్త యూఐ తో Windows 12 OS ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు విండోస్ సెంట్ర‌ల్ నివేదిక పేర్కొంది.

కొత్త విండోస్ వ‌చ్చేస్తోంది.. Windows 12 ఓఎస్ విడుద‌ల ఎప్పుడంటే!

విండోస్ సెంట్రల్ నుండి తాజా నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రధాన Windows OS అప్‌డేట్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా, 2024లో Windows 12 ప్రారంభం చేస్తుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. మ‌రోవైపు, మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికీ Windows 11కి కొత్త ఫీచర్లను జోడించేందుకు కృషి చేస్తోంది. కాబ‌ట్టి, Windows 11 తదుపరి రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ మరియు కొత్త ఫీచ‌ర్‌ అప్‌డేట్‌లను అందుకోవడం కొనసాగుతుందని స‌మాచారం.

Windows 12 OS ఎప్పుడు విడుద‌ల‌:
2024 నాటికి Windows 12 భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడుతుందని నివేదిక పేర్కొంది. Windows 11 OS నడుస్తున్న అర్హత కలిగిన PCలలో Windows 12 ఉచితంగా అందుబాటులో ఉంటుంది. Windows 12 లభ్యత ఆధునిక హార్డ్‌వేర్ క‌లిగిన‌ PCలకు పరిమితం చేయబడుతుందని గమనించాలి. కాబ‌ట్టి, అన్ని Windows 11-ఆధారిత PCలు మరియు ల్యాప్‌టాప్‌లు Windows 12 OSని అందుకోకపోవచ్చని తెలుస్తోంది. రాబోయే కొత్త ఓఎస్.. సన్ వ్యాలీ 3 అప్‌డేట్ పేరుతో విండోస్ 11కి వచ్చే ఫీచర్లను కలిగి ఉంటుందని నివేదిక సూచిస్తుంది. మ‌రోవైపు, Windows 12 OSలో Microsoft చేర్చ‌బోయే కొత్త ఫీచర్లు ఏమిటనేది మరియు వాటి సామర్థ్యాలపై ఇంకా ఇప్ప‌టివ‌ర‌కు ఖచ్చితమైన సమాచారం లేదు.

కొత్త విండోస్ వ‌చ్చేస్తోంది.. Windows 12 ఓఎస్ విడుద‌ల ఎప్పుడంటే!

మ‌రోవైపు.. ఇప్ప‌టికే Windows 8.1 ఓఎస్ యూజ‌ర్ల‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మైక్రోసాఫ్ట్‌..!
ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ఇటీవ‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. Windows 8.1 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వ‌చ్చే ఏడాది (2023) జ‌న‌వ‌రి చివ‌రి వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేసింది. విండోస్ కి సంబంధించిన పాత వెర్షన్‌ ఆపరేటింగ్ సిస్టమ్ కు సాంకేతిక స‌హ‌కారం మరియు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ జనవరి 10, 2023 తర్వాత అందించడం జ‌ర‌గ‌ద‌ని టెక్ దిగ్గజం తెలిపింది. ఈ మేర‌కు కంపెనీ త‌మ స‌పోర్ట్ వెబ్‌సైట్ వేదిక‌గా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

 

కొత్త వ‌ర్శ‌న్‌కు అప్‌డేట్ అవ్వాలి:
మైక్రోసాఫ్ట్ సంస్థ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. Windows 8.1 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కు సంబంధించి కంపెనీ 2023, జ‌న‌వ‌రి వ‌ర‌కు స‌పోర్ట్ ఇస్తుంద‌ని తెల‌పింది. ఇప్ప‌టికీ ఇంకా ఎవ‌రైనా యూజ‌ర్లు ఈ పాత వ‌ర్శ‌న్‌ను వాడే వాళ్లు ఉంటే.. వారు త‌మ వ్య‌క్తిగ‌త కంప్యూట‌ర్ల‌లో లేటెస్ట్ వ‌ర్శ‌న్ Windows 11 అప్‌డేట్ చేసుకోవాల‌ని కోరింది. 2023, జ‌న‌వ‌రి 10 వ‌తేదీ త‌ర్వాత నుంచి పాత వ‌ర్శ‌న్ ఓఎస్‌కు సంబంధించి సెక్యూరిటీ అప్‌డేట్స్‌, సాంకేతిక స‌హ‌కారం నిలిపి వేయ‌నున్న‌ట్లు సూచించింది. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌తో పాటుగా యూజ‌ర్ల అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు ప‌లు కామ‌న్ ప్ర‌శ్న‌ల‌కు (ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వ‌శ్చ‌న్స్‌) స‌మాధానాల‌ను కూడా నివృత్తి చేస్తూ ఓ డాక్యూమెంట్‌ను కంపెనీ ప‌బ్లిష్ చేసింది. 2023, జనవరి తర్వాత విండోస్ 8.1లో ఉండడం వల్ల మీ పీసీ ప్ర‌మాదంలో ప‌డేందుకు ఆస్కారం ఉంటుంద‌ని కంపెనీ హెచ్చ‌రించింది. ప‌లు మాల్వేర్ వైర‌స్‌లు పీసీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని జాగ్ర‌త్త ప‌డాల‌ని హెచ్చ‌రించింది.

కొత్త విండోస్ వ‌చ్చేస్తోంది.. Windows 12 ఓఎస్ విడుద‌ల ఎప్పుడంటే!

కేవ‌లం స‌పోర్ట్ మాత్రం ఆగిపోతుంది.
Windows 8.1 కి స‌పోర్ట్ నిలిపివేయడం అంటే కేవ‌లం సెక్యూరిటీ మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మాత్ర‌మే ఆగిపోతాయి. అంతేకానీ పాత వ‌ర్శ‌న్ ప‌నిచేస్తూనే ఉంటుంది. మ‌రోవైపు జ‌న‌వ‌రి 10, 2023 త‌ర్వాత మైక్రోసాఫ్ 365 అప్లికేష‌న్లు కూడా ఎక్కువ కాలం ఈ Windows 8.1 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కు స‌హ‌క‌రించ‌వు. ఈ యాప్స్‌ మైక్రోసాఫ్ట్ మోడ్రన్ లైఫ్‌సైకిల్ పాలసీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. కావున‌, వినియోగదారులు అప్‌డేట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్ర‌మంలో అప్‌డేట్ కానీ పాత వ‌ర్శ‌న్ ఓఎస్ డివైజ్‌ల‌లో Microsoft Word, Microsoft Excel మరియు ఇతర Microsoft Office అప్లికేషన్‌లు కూడా తాజా భద్రత మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను స్వీకరించడం ఆపివేస్తాయి.

Best Mobiles in India

English summary
Windows 12 Is Coming Sooner Than You Expected: Windows 12 Release Date Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X