విండోస్ ఫోన్ యూజర్స్‌కు శుభవార్త

Posted By: Super

విండోస్ ఫోన్ యూజర్స్‌కు శుభవార్త

 

మైక్రోసాప్ట్ త్వరలో విడుదల చేయనున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి పనిని ప్రారంభించింది. గతంలో విడుదల చేసిన విండోస్ పోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత విండోస్ ఫోన్ 8 అపోలో పేరుతో కొత్త వర్సన్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం మ్యాంగో ఫ్లాట్ ఫామ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

మైక్రోసాప్ట్ అప్ డేట్స్‌ సమాచారం అందించే MSNerd తెలిపిన దాని ప్రకారం మైక్రోసాప్ట్ ప్రస్తుతం 'విండోస్ ఫోన్ 8 అపోలో' పై పనిని ప్రారంభించింది. ప్రస్తుతం విండోస్ ఫోన్ డివైజెస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే సపోర్ట్ చేయనున్నాయి. విండోస్ ఫోన్ 7 డివైజ్‌లకు సంబంధించిన విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో అప్‌డేట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

విండోస్ ఫోన్ 8 అపోలో గురించిన అధికారకి సమాచారాన్ని మైక్రోసాప్ట్ ఈ సంవత్సరం అక్టోబర్‌లో తెలియజేయనుంది.  అపోలో ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి హార్డ్ వేర్ డిటైల్స్ మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 8 అపోలో డెలివరీ షెడ్యూల్ గురించి తీవ్ర కసరత్తులు చేస్తుందని MSNerd తెలిపింది.

మొదట అమెరికాలో ఉన్న మొబైల్ ఆపరేటర్స్‌తో ఆపరేటింగ్ సిస్టమ్‌పై టెస్టులు  చేసి.. ఆ తర్వాత అధికారకంగా విండోస్ పోన్ 8 అపోలో సమాచారాన్ని తెలియజేయనుంది.  డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్‌ని కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి విండోస్ ఫోన్ 8 అపోలో ఆపరేటింగ్ ఎక్స్ క్లూజివ్ పీచర్స్‌ని  అందించనుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot