Xiaomi 200W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ ఆవిష్కరణ!! 8minలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్...

|

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందిన వాటిలో షియోమి ముందువరుసలో ఉంటుంది. ఈ సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం కొత్త కొత్త పరిష్కారాలను ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పుడు త్వరిత ఛార్జింగ్ కోసం తన హైపర్ ఛార్జ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది మొత్తం మార్కెట్లో వేగవంతమైన ఛార్జింగ్ కు పరిష్కారంగా చెప్పబడింది. కొత్త-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ కేవలం ఎనిమిది నిమిషాల్లోనే మీ యొక్క ఫోన్ ను 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. 120W ఛార్జింగ్ పరిష్కారం వద్ద వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో కూడా లభిస్తుంది అని షియోమి ధృవీకరించింది.

షియోమి

షియోమి సంస్థ కొత్తగా అభివృద్ధి చేసిన హైపర్ ఛార్జింగ్ టెక్నాలజీ 120W మద్దతుతో లభిస్తూ కేవలం 15 నిమిషాల్లో పరికరాన్ని పూర్తిగా ఛార్జ్ చేయగలదు. కస్టమ్-నిర్మించిన షియోమి Mi11 ప్రోని ఈ హైపర్ టెక్ యొక్క ఛార్జింగ్ సామర్థ్యాలను ఉపయోగించి కూడా కంపెనీ ప్రదర్శించింది. ఈ ఫోన్ హుడ్ కింద 4,000mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా వైర్డ్ ఛార్జర్ ఉపయోగించి ఎనిమిది నిమిషాల్లో పరికరాన్ని ఛార్జ్ చేస్తామని కంపెనీ పేర్కొంది.

షియోమి హైపర్‌ఛార్జ్ టెక్‌ను ప్రారంభించింది

షియోమి హైపర్‌ఛార్జ్ టెక్‌ను ప్రారంభించింది

షియోమి తన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ హైపర్‌ఛార్జ్ టెక్‌ను 4,000mAh బ్యాటరీతో కూడిన కస్టమ్ మేడ్ Mi 11 ప్రోతో మొదటిసారిగా ప్రదర్శించింది. డెమో సమయంలో ఈ ఫోన్ కేవలం 3 నిమిషాల్లో 0 నుండి 50% వరకు ఛార్జ్ చేయబడింది. మొబైల్ తయారీ బ్రాండ్లు కూడా ఈ ఫోన్‌ను 8 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలవని పేర్కొన్నారు. ఇంకా హైపర్‌ఛార్జ్ టెక్ సాయంతో వైర్‌లెస్ పద్ధతిలో కేవలం 15 నిమిషాల్లో పరికరాన్ని ఛార్జ్ చేయగలదని కంపెనీ సూచిస్తుంది.

ఛార్జింగ్ డివైస్

కొత్త ఛార్జింగ్ డివైస్ యొక్క వాణిజ్య విడుదల గురించి కంపెనీ ఇంకా ఏమీ వెల్లడించలేదు. ఇంతకుముందు షియోమి 120W వైర్డు మరియు 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఆవిష్కరించింది. అయితే ఇంత వేగంగా ఛార్జింగ్ టెక్‌తో అనుకూలమైన వాణిజ్య లభ్యత మరియు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. Mi 11 అల్ట్రా, Mi 11 ప్రో, మరియు రెడ్‌మి K40 వంటి హ్యాండ్‌సెట్‌లు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్‌లను లాంచ్ చేయాలని కంపెనీ ఎప్పటినుంచో యోచిస్తుంది.

ఇతర వార్తలలో కంపెనీ Mi 11 లైట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ స్మార్ట్ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-హెచ్డి + డిస్ప్లేని 1,080 × 2,400 పిక్సెల్స్ మరియు 402 పిపి పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంది.

 

Best Mobiles in India

English summary
Xiaomi 200W HyperCharge Technology Reveled!! Battery Full Charge in 8 Minutes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X