రూ. 19 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

Written By:

ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోతున్న షియోమి రోజురోజుకు కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. గతేడాది అక్టోబర్ లో Ninebot mini పేరుతో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ ను రిలీజ్ చేసి సంచలనం రేపింది. అదే ఊపులో ఏ ఏడాది జూన్ లో Qicycle Electric Folding బైక్ ని రీలీజ్ చేసింది. అయితే ఇవి మార్కెట్లో అలా నడుస్తుండగానే మళ్ళీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీనికి Mi Electric Scooter అని నామకరణం చేసింది. ఈ స్కూటర్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

జియో తర్వాత ముఖేష్ అంబాని మాస్టర్ ప్లాన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రేడ్ అల్యూమినియంతో

ఈ స్కూటర్ ని ఎయిర్ క్రాప్ట్ లు తయారుచేసే గ్రేడ్ అల్యూమినియంతో బాడీని డిజన్ చేశారు. ఇది స్కూటర్ కి మరింత సెక్యూరిటీని అందిస్తుంది. దీనిపై గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అవసరమైతే మడతపెట్టుకుని మీరు తీసుకెళ్లవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

280 వాట్అవర్స్

ఇందులో ఎల్జీ 18650 అనే 280 వాట్అవర్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. దీంతో స్కూటర్ను ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

నాలుగు ఎల్ఈడీ పవర్ ఇండికేటర్లు

బ్యాటరీ పవర్ను తెలియజేసే నాలుగు ఎల్ఈడీ పవర్ ఇండికేటర్లు ఈ స్కూటర్ పై అమర్చారు. బ్యాటరీ హెల్త్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బీఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఈ స్కూటర్లో ఏర్పాటు చేశారు.

1.1 వాట్ల సామర్థ్యం గల ఎల్ఈడీ లైట్

ఇందులో 1.1 వాట్ల సామర్థ్యం గల ఎల్ఈడీ లైట్ ఉంది. దీంతో ఈ స్కూటర్పై రాత్రి పూట కూడా ప్రయాణించవచ్చు. దాదాపు 6 మీటర్ల దూరం వరకు ఈ స్కూటర్ లైట్ పడుతుంది.

స్టార్ట్ చేసిన 3 సెకన్లలోనే

ఇది కేవలం స్టార్ట్ చేసిన 3 సెకన్లలోనే ముందుకు వెళుతుంది. దీని బరువు కేవలం 12.5kg మాత్రమే. 75 కిలోల బరువు వరకు ఈ స్కూటర్ తట్టుకోగలుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఇది లభ్యమవుతోంది.

ధర రూ .19,530

దీని ధర రూ .19,530. అయితే ఇది చైనాలో మాత్రమే లాంచ్ అయింది.ఇండియాకి ఎప్పుడు వస్తుందని ఇంకా షియోమి చెప్పలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి అక్కడ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Electric Scooter Launched, Can Fold With the Press of a Button in 3 Seconds
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot