షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో VS రెడ్‌మి నోట్ 7 ప్రో: వీటి మధ్య ఉన్న పెద్ద తేడాలు

|

షియోమి అనగానే స్మార్ట్‌ఫోన్ లకు ప్రసిద్ధి. ఈ సంస్థ నుండి చాలా రకాల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. షియోమి సంస్థ ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసిన చాలా విషయాలు ఉంటాయి. కొన్ని నెలల ముందు షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇటీవల చైనాలో రెడ్‌మి నోట్ 7 ప్రోకు కొనసాగింపుగా షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోను విడుదల చేశారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ యూనిట్లకు పైగా రెడ్‌మి నోట్ 7 సిరీస్‌ను విక్రయించిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.

Xiaomi Redmi Note 8 Pro VS Redmi Note 7 Pro: Big differences between them

ఈ పరికరాన్ని రెండు నెలల వ్యవధిలో భారత్‌లో లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తుండగా ఇది ఇప్పటికే చాలా హైప్‌ని సృష్టిస్తోంది. రెడ్‌మి నోట్ 8 ప్రో అనేక మార్పులతో వస్తోంది. ఇది సాధ్యమయ్యే ప్రతి విధంగా మెరుగ్గా ఉంటుంది. ఇందులో క్రొత్తది మరియు భిన్నమైనది ఏమిటో ఇక్కడ చూడండి.

షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో VS రెడ్‌మి నోట్ 7 ప్రో

షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో VS రెడ్‌మి నోట్ 7 ప్రో

స్పెసిఫికేషన్స్

పనితీరు పరంగా రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య పెద్ద మార్పును కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 8 ప్రో మీడియాటెక్ హెలియో G90T చిప్‌సెట్ ద్వారా పనిచేసే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇది కొత్త ఆక్టా-కోర్ CPU తో వస్తుంది. హీలియో G90T రెండు ARM కార్టెక్స్ A76 కోర్లను మరియు ఆరు ARM కార్టెక్స్ A55 కోర్లను ఉపయోగిస్తుంది. ఇది మెరుగైన గేమింగ్ కోసం ఏకకాల వైఫై మరియు 4G వాడకం వంటి కొత్త ఫీచర్లను కూడా తెస్తుంది. ఇతర పెద్ద మార్పు పెద్ద 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ రూపంలో వస్తుంది. ఇది దాని ముందు చూసిన 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ నుండి వచ్చిన బంప్.

 

కెమెరాలు

కెమెరాలు

పనితీరుతో పాటు షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోలో కెమెరా కాన్ఫిగరేషన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. మొదటి కెమెరా 64 మెగాపిక్సెల్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌తో జత చేయబడింది. 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ తో కలిపి మొత్తంగా నాలుగు కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు షియోమి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను ఉపయోగిస్తోంది. ఇది రెడ్‌మి K20 సిరీస్‌లో చూసినట్లుగా ఉంటుంది. రెడ్‌మి నోట్ 7 ప్రో లో 48 మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది.

ఇతర మార్పులు

ఇతర మార్పులు

షియోమి కూడా గ్లాస్ బ్యాక్ ను గట్టి పట్టు కోసం కొత్తగా డిజైన్‌ను సర్దుబాటు చేసింది. ఇది పూర్తి HD + రిజల్యూషన్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతు కూడా ఉంది. ఇది చైనాలోని RMB 1,399 వద్ద మొదలవుతుంది మరియు ఇది భారతదేశంలో కూడా 13,999 రూపాయలకు అందుబాటులోకి వచ్చిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 8 Pro VS Redmi Note 7 Pro: Big differences between them

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X