యూజర్ల డేటాను అధికంగా ఏ కంపెనీ సేకరిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!!

|

ప్రస్తుత ఫాస్ట్ మరియు ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా తమకు కావలసిన వాటిని పొందడానికి ఆన్ లైన్ ని ఆశ్రయిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడం కోసం దానిని వివిధ విభాగాలలో తనిఖీ చేస్తూ ఉంటారు. అనేక చోట్ల తనిఖీ చేసేటప్పుడు మీ యొక్క డేటాను అందులో ఇస్తూ ఉంటారు. అయితే ప్రతి కంపెనీ కూడా వినియోగదారుల డేటాను సేకరిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో డేటా అనేది అత్యంత ముఖ్యమైన కరెన్సీ కావడం విశేషం.

 

యుఎస్‌జ్ ప్యాటర్న్‌

వినియోగదారుల యొక్క అవసరాలు మరియు యుఎస్‌జ్ ప్యాటర్న్‌లను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల అప్లికేషన్‌లు తమ యొక్క సేవలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా వినియోగదారుల అవసరాలకు ఫీచర్‌లను అనుకూలీకరించడమే కాకుండా ఇతర విషయాలతోపాటు ప్రకటనల కోసం లక్ష్య ప్రకటనలను అందించడానికి కూడా ఉపయోగించబడుతుంది. అన్ని కంపెనీలు వినియోగదారుల యొక్క డేటాను సేకరిస్తూ ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఇతరుల కంటే కొంచెం అధికంగానే డేటాను సేకరిస్తాయి. అయితే నేటి ప్రపంచంలో వినియోగదారుల యొక్క డేటాను అధికంగా సేకరించే కంపెనీల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Stockapps.com

Stockapps.com ఇటీవల నిర్వహించిన సమాచారం ప్రకారం గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ మరియు యాపిల్ వంటి బిగ్ టెక్ కంపెనీలు వినియోగదారుల యొక్క డేటాను అధికంగా సేకరిస్తున్నాయి. అయితే వీటిలో అత్యధిక మొత్తంలో యూజర్ల యొక్క డేటాను గూగుల్ సంస్థ సేకరిస్తుంది.

టెక్ కంపెనీలు
 

టెక్ కంపెనీలు

టెక్ కంపెనీలు అన్ని కూడా వినియోగదారుల యొక్క డేటాను యాదృచ్ఛికంగా సేకరించడం లేదు. బదులుగా అన్ని కంపెనీలు తమకు సంబంధించిన డేటా పాయింట్లను కూడా అదనంగా సేకరిస్తాయి. డేటా పాయింట్ల విషయానికి వస్తే మీరు ఇంటర్నెట్ ని వినియోగిస్తున్నప్పుడు మీ యొక్క లొకేషన్, మీ ఆసక్తులు, మీ పేరుతో పాటుగా ఫోన్ నెంబర్ మరియు మీరు తరచుగా మాట్లాడే అంశాలతో పాటు ఇతర విషయాలను సేకరిస్తూ ఉంటారు. ప్రతి కంపెనీ కూడా ఒక నిర్దిష్ట వర్గంకు చెందిన డేటాపై దృష్టి పెడుతుంది కానీ డేటా యొక్క పరిమాణంపై దృష్టి సారించదు అని నివేదిక పేర్కొంది.

గూగుల్ కంపెనీ

Stockapps.com యొక్క అధ్యయనం ప్రకారం గూగుల్ కంపెనీ మొత్తంగా 39 డేటా పాయింట్లను సేకరించడంతో బ్యాండ్‌వాగన్‌లో మిగిలిన వారితో పోలిస్తే అందరికంటే ముందు స్థానంలో ఉంది. ఈ కంపెనీ యొక్క మొత్తం బిజినెస్ అనేది వినియోగదారుల యొక్క డేటా సేకరణపై ఆధారపడినందున అందరి కంటే ముందు స్థానంలో ఉండడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించదు. ఇది థర్డ్-పార్టీ ట్రాకర్‌లపై ఆధారపడకుండా ప్రకటనల కోసం తాను సేకరించిన డేటాపై అధికంగా ఆధారపడుతుంది.

Facebook

వినియోగదారుల యొక్క డేటాను సేకరించే విషయంలో గూగుల్ కంపెనీ తర్వాత ట్విట్టర్ కంపెనీ ఉంది. ఇది మొత్తంగా 24 డేటా పాయింట్లను సేకరించి రెండవ స్థానంలో ఉండగా అమెజాన్ 23 డేటా పాయింట్లను సేకరించి మూడవ స్థానంలో ఉంది. ఆశ్చర్యకరంగా Facebook సంస్థ కేవలం 14 డేటా పాయింట్లను మాత్రమే సేకరించింది. 10 పాయింట్లు తేడా ఉన్నప్పటికి కూడా ఇది నాల్గవ స్థానంలో నిలిచింది. చివరిగా బిగ్ టెక్ సంస్థలలో అతి తక్కువ డేటాను ఆపిల్ సంస్థ సేకరిస్తుంది. అధ్యయనం ప్రకారం ఇది కేవలం 12 డేటా పాయింట్లను మాత్రమే సేకరిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫేస్‌బుక్ కంటే ట్విట్టర్ ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని కంపెనీ యొక్క అధ్యయనం చెబుతోంది. ఫేస్‌బుక్ కంపెనీ వారు స్టోర్ చేసే డేటాలో ఎక్కువ భాగం వినియోగదారులు నమోదు చేసిన సమాచారం మాత్రమే ఉండడం గమనార్హం.

ఆపిల్

వినియోగదారుల యొక్క గోప్యతను రక్షించడంలో ఆపిల్ సంస్థ అమెజాన్ కంటే అగ్రస్థానంలో ఉంది. తన యొక్క వినియోగదారులకు అత్యంత గోప్యతా స్పృహను కలిగిన సంస్థ ఏది అంటే కనుక ఆపిల్ అందరి కంటే ముందు ఉంటుంది. ఆపిల్ కంపెనీ తన యొక్క వినియోగదారుల అకౌంటులను నిర్వహించడానికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే నిల్వ చేస్తుంది. ఎందుకంటే వారి యొక్క వెబ్‌సైట్ గూగుల్, ట్విటర్ మరియు ఫేస్‌బుక్ వంటి ప్రకటనల ఆదాయంపై ఆధారపడకపోవడమే అని అధ్యయనం పేర్కొంది.

Best Mobiles in India

English summary
You Will Be Shocked to Know Which Big Tech Company Collects More Users Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X