ఆకాశంలో షికారు, మస్క్ రాకెట్ ఎలా ఉందో చూశారా ?

ఎలాన్ మస్క్...ఈ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆకాశంలోకి మనుషుల్ని తీసుకువెళ్లే చారిత్రాత్మక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు.

|

ఎలాన్ మస్క్...ఈ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆకాశంలోకి మనుషుల్ని తీసుకువెళ్లే చారిత్రాత్మక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గతేడాది ఆకాశంలోకి కారును కూడా పంపించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకేట‌్ ఫాల్కన‌్ హెవీ ద్వారా.. టెస్లా రోడ్ స్టర‌్ మోడల్ కారును అంతరిక్షంలోకి పంపించింది. నాసా కీలక ప్రయోగాలకు వేదికైన కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచే ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే కారును నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. అయినప్పటికీ ప్రయోగం విజయవంతం కావడంతో వారి ముందు ముందు ప్రయోగాలకు ఇది వేదికగా మారింది. ఇప్పుడు మార్స్ మీదకు వెళ్లే రాకెట్ ఫోటోలు లీకయి మరో అద్భుతానికి వేదికగా నిలిచాయి.

జనవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 10 లైట్జనవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 10 లైట్

స్పేస్ ఎక్స్

స్పేస్ ఎక్స్

ఆకాశంలోకి మనుషుల్ని తీసుకువెళ్లేందుకు తయారుచేస్తున్న స్పేస్ ఎక్స్ షిప్ కు సంబంధించిన టెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. మార్స్ మీదకు వెళ్లే స్పేస్ ఎక్స్ తయారీ ఎలా ఉంటుందనే విషయం ఈ ఫోటోల ద్వారా తెలుసుకోవచ్చు.

 

 

నాసా తన స్పేస్ ప్లైట్ ద్వారా..

నాసా తన స్పేస్ ప్లైట్ ద్వారా..

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన స్పేస్ ప్లైట్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసింది. అక్కడ పెద్దగా కనిపిస్తున్న సిలిండర్ మెటల్ పక్కన అతి పెద్ద అమెరికా జెండాని కూడా మీరు చూడవచ్చు.

ఫాల్కన్ రాకెట్

ఫాల్కన్ రాకెట్

అయితే ఇంతకుముందు బిగ్ ఫాల్కన్ రాకెట్ ఆకాశంలోకి వెళ్లడంలో విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. దానికి అప్పుడు అది ఫాల్కన్ రాకెట్ కాదు ఫెయిల్ రాకెట్ అని సోషల్ మీడియా నుంచి బిరుదు కూడా అందుకుంది

మస్క్ ట్వీట్

మస్క్ ట్వీట్

గతేడాది ఎలాన్ మస్క్ ఈ స్పెస్ రాకెట్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందులో స్టెయిన్ లెస్ స్టీల్ స్టార్ షిప్ అంటూ ఓ ఫోటోను కూడా ట్వీట్ చేశారు. ఈ ఫోటో ప్రకారం అంతరిక్షంలోకి మనుషులను తీసుకువెళ్లేందుకు మాస్క్ తీవ్ర పరిశోధనలు చేస్తునట్లు తెలుస్తోంది.

 

 

 లీకయిన ఫోటోలు చూస్తే

లీకయిన ఫోటోలు చూస్తే

కాగా ఎలాన్ మస్క్ ట్వీట్ అలాగే లీకయిన ఫోటోలు చూస్తే నిజంగానే రాకెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది అట్లాంటిక్ రాకెట్ కుటుంబంలాగే ఉందని కూడా తెలుస్తోంది. దీనికి ఊతంగా మస్క్ ఇది ఫూర్తిగా ఢిపరెంట్ ఆర్కిటెక్చర్ తో ఉంటుందని తెలిపారు.

మార్చి ఏప్రిల్ లో టెస్టింగ్

మార్చి ఏప్రిల్ లో టెస్టింగ్

కాగా దనిపై మార్చి లో కాని ఏప్రిల్ కాని టెస్టింగ్ నిర్వహిస్తామని పరిశోధనను వీలయినంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ తెలిపారు. ఆసక్తి ఉన్నఓత్సాహికులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని ద్వారాలను తీసామని చెప్పారు.

Best Mobiles in India

English summary
Elon Musk's Mars rocket takes shape: New photos reveal the clearest look yet at progress on the Starship prototype

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X