ఫేస్‌బుక్‌లో లైకులు కొడుతున్నారా..?

Written By:

ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ అకౌంట్ లేకుండా ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనిపించిన ప్రతి పోస్టుకూ లైక్ కొడుతూ నిత్యం అందులోనే మునిగితేలుతుంటారు. ఇక స్టేటస్ అప్‌డేట్‌లు అయితే తెగ మార్చేస్తుంటారు కూడా. అయితే ఇలా చేయడం వెనుక అనేక అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానసిక, శారీరక అనారోగ్యంతో బాధపడే వారే ఇలా తరచూ చేస్తుంటారని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య, మానసిక పరిశోధకులు తేల్చారు.

పాత ఫోన్ ఇవ్వండి, 18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పదేపదే లైకులు కొట్టేవారు

ఫేస్‌బుక్‌లో పదేపదే లైకులు కొట్టేవారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, తరచూ స్టేటస్ అప్‌డేట్ చేసేవారు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైనట్టు వివరించారు.

బాడీ మాస్ ఇండెక్స్

శరీర బరువు పెరగడానికి, ఫేస్‌బుక్ వాడకానికి సంబంధం లేదని పేర్కొన్న పరిశోధకులు బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉన్నవారు ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిపారు.

ఫేస్‌బుక్‌లో ఎక్కువగా గడపడం వల్ల

ఇప్పటికే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా గడపడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని పరిశోధనకారులు హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది స్నేహితులున్న వారు

ఈ వివరాలను ‘లైవ్‌ సైన్స్‌' వెల్లడించింది. ఇంతకు ముందు జరిపిన అధ్యయనాలు ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది స్నేహితులున్న వారు ఎక్కువ రోజులు బతుకుతారని తెలిపాయి.

5,200 మందిపై

5,200 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు వారు పేర్కొన్నారు. సో.. లైకులు కొట్టేముందు ఒక్కసారి ఆలోచించండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook use may harm your mental, physical health: study read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot