పాత ఫోన్ ఇవ్వండి, 18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం చేసుకోండి

Written By:

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ మోటోరోలా తన తాజా స్మార్ట్‌ఫోన్‌ మోటో ఎం (గ్రే వేరియంట్) పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ రోజు నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. పాత ఫోన్ ఇవ్వడం ద్వారా సుమారు 15 వేల తగ్గింపుతో మోటో ఎమ్ కొత్త వేరియంట్ ను సొంతం చేసుకోవచ్చు. ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా మెటా ఎం గ్రే కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే అందించనుంది. ఈ మధ్యా‍హ్నం నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

భారీ బ్యాటరీతో జెడ్‌టీఈ బ్లేడ్ A2 Plus

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

5డి కర్వుడ్ గ్లాస్ మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే రాబోతోంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆకట్టుకుంటుంది. చూపుడు వేలుకు అందే విధంగా ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ను ఏర్పాటు చేసారు.

ఆక్టా కోర్ ప్రాసెసర్‌

2.2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

4జీబి ర్యామ్ సపోర్ట్‌..

4జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీనికి కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. పీడీఏఎఫ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో చూడొచ్చు.

శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే విధంగా శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ లో ఏర్పాటు చేయటం జరిగింది. రెండు డాల్బీ అటామస్ స్టీరియో స్పీకర్లను కూడా లెనోవో ఈ ఫోన్‌లో అమర్చింది.

లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన లెనోవో వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 4జీ వోల్ట్, జీపీఎస్, బ్లుటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ర్యామ్ వేరియంట్స్

ర్యామ్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto M Grey Colour Variant to Go on Sale in India Today read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot