సోషల్ మీడియా వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

నేటి యువతకు సోషల్‌ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు

By Hazarath
|

నేటి యువతకు సోషల్‌ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు... ప్రతిక్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ ఒడిసి పట్టుకుని...పోస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక క్షణక్షణం అప్‌డేట్లు చూడటం ఓ అలవాటుగా మారిపోయింది. అయితే సోషల్ మీడియాలో నష్టాలతో పాటు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి లాభాలపై ఓ లుక్కేద్దాం.

 

మీకు నచ్చిన కలర్స్‌లో ఫేస్‌బుక్‌ని సెట్ చేసుకోవచ్చు, సింపుల్ ట్రిక్స్మీకు నచ్చిన కలర్స్‌లో ఫేస్‌బుక్‌ని సెట్ చేసుకోవచ్చు, సింపుల్ ట్రిక్స్

Keep In Touch

Keep In Touch

మన మిత్రులు అలాగే బంధువులు దేశాలను దాటి ఎక్కడో నివసిస్తుంటారు. వారితో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్షణాల్లో వారినుంచి సమాచారం తెలుసుకోవచ్చు. ఫోటోస్, వీడియోస్, మెసేజ్‌లు అన్నీ వారితో షేర్ చేసుకోవచ్చు.

Source Of Learning And Teaching

Source Of Learning And Teaching

మనకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో చూసి నేర్చుకోవచ్చు. ఏదైనా డౌటు వచ్చిందంటే దానికి సంబంధించి క్లారిఫై చేసుకోవాలంటే ముందుగా అందరూ ఎంచుకునేది సోషల్ మీడియానే.

Save Time And Money
 

Save Time And Money

మీరు ఇంటి దగ్గర నుంచే సోషల్ మీడియా ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించుకోవచ్చు. సమాచారం కోసం బుక్ స్టోర్లకు అలాగే కాలేజీలకు వెళ్లనవసరం లేదు. దీని వల్ల టైం, డబ్బు రెండూ సేవ్ అవుతాయి. అలాగే మనకు కావలిసిన వస్తువులను ఈ సోషల్ మీడియా ద్వారానే కొనుగోలు చేయవచ్చు.

 Friends

Friends

మీకు తెలియకుండానే ఎంతో మంది స్నేహితులు ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయచవుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోగలుగుతున్నారు. అయితే వారిలో మనకు నచ్చినవారిని సెలక్ట్ చేసుకుంటే మంచి స్నేహం పుడుతుంది. కొంతమంది దీన్ని ఆసరగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కూడా..వారికి దూరంగా ఉండటం మంచిది.

 Empathy

Empathy

మనం బాధలో ఉన్నా కాని ఆనందంలో ఉన్నా కాని దాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటే మనకు ఎంతో ఓదార్పు కలుగుతుంది పరోక్షంగా ఎంతోమంది నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని పరోక్షంగా నీకు సహకరిస్తారు కూడా. వారి పెట్టే మెసేజ్‌లతో నీకు కొంత ధైర్యం కూగా వచ్చే అవకాశం ఉంది.

Boost Communication

Boost Communication

ఈ బిజి ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ శరవేగంగా విస్తరిస్తోంది. నీవునీకు తెలిసిన మాచారం క్షణాల్లో ఇతరులకు చేరిపోతోంది.

 Build Relationships

Build Relationships

ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నీవు ఒంటరికానే కాదు. రిలేషన్ షిప్ కావాలనుకున్న వారికి బెస్ట్ ఆప్సన్ సోషల్ మీడియానే. దీని ద్వారానే ఒకర్నిఒకరు పరిచయం చేసుకుని కలుసుకుంటుంటారు. ఆప్త మిత్రులుగా మారుతుంటారు.

Education

Education

ఇందులో చాలామంది అనుభవం కలవారు తమ అనుభవాలను పంచుకుంటుంటారు. వారితో కమ్యూనికేషన్ అయితే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. చదువుకు సంబంధించిన అనేక వీడియోల ద్వారా మీరు సబ్టెక్ట్ మీద పట్టు సంపాదించే అవకాశం కూడా ఇక్కడ కలుగుతుంది.

Encourage Community Participation

Encourage Community Participation

సోషల్ మీడియా ద్వారా మనకు అనేక రకాలైన ఈవెంట్ల సమాచారం తెలుస్తోంది. దానిలో మనం కూడా బాగస్వాములు కావడం ద్వారా అలాగే సమస్యలను చర్చించడం ద్వారా మనకు ఎన్నో సరికొత్త విషయాలు తెలుస్తాయి. దీనికి సరైన వేదిక సోషల్ మీడియానే.

Improve Self-Confidence

Improve Self-Confidence

మన సెల్ఫ్ కాన్సిడెన్స్ పెంచుకునేందుకు సోషల్ మీడియానే ఉత్తమమైన మార్గం అంటే ఎవరూ నమ్మరు కాని ఇది నిజం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి మీకు ధైర్యం కలిగించేందుకు ఇది చక్కటి వేదిక. మీ మైనస్ లను ఇతరులతో పంచుకోవడం ద్వారా వారు మీకు వాటినుంచే బయటపడే ఛాన్సలను చెప్పే అవకాశం ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Top Positive Effects Social Networks Have On You Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X