వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?

By Maheswara
|

మెటా సంస్థ యాజమాన్యంలో పనిచేస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇప్పుడు కొత్త ఫీచర్‌ ని తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ ఫోటోలను ఒరిజినల్ క్వాలిటీ తో ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్ లో ఫోటోలను షేర్ చేసే సమయంలో ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడి, తక్కువ రిజల్యూషన్‌ లో ఫోటోలు షేర్ అవుతుంటాయి. ఇప్పుడు రాబోయే ఈ కొత్త ఫీచర్ తో ఈ సమస్య పరిష్కారం కానుంది. WABetaInfo సమాచారం ప్రకారం, ఈ ఫంక్షనాలిటీ ఫీచర్ భవిష్యత్తులో WhatsApp అప్‌డేట్‌లో చేర్చబడే అవకాశం ఉంది, ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది అని సమాచారం.

 
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పని

ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు WhatsApp యొక్క "సెట్టింగ్‌లు" విభాగంలో, వినియోగదారులు ఇతర వ్యక్తులకు పంపే చిత్రాల కోసం నాణ్యత ప్రీసెట్‌ ఫంక్షన్ ను "ఆటోమేటిక్," కు బదులుగా "ఉత్తమ నాణ్యత" లేదా "డేటా సేవర్" ఆప్షన్ ని ఎంచుకోవడానికి వీలు కలిగి ఉంటారు. అయినప్పటికీ, ఒరిజినల్ క్వాలిటీ కాన్ఫిగరేషన్‌లో పంపే ఫోటోలు కూడా వాటి అసలు నాణ్యతతో పంపబడవు ఎందుకంటే అవి ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడతాయి. ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ లో ఈ సరికొత్త వాట్సాప్ బీటా ఫీచర్‌ని పరీక్షిస్తోంది, ఇది వినియోగదారులు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

త్వరలో WhatsApp లో రాబోయే ఈ ఫీచర్‌పై మరిన్ని వివరాలు

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ యొక్క స్క్రీన్‌షాట్‌లో చూపినట్లుగా, డ్రాయింగ్ టూల్ యొక్క హెడర్‌లో కొత్త సెట్టింగ్ ను చేర్చాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా, వినియోగదారులు ఫోటో నాణ్యతను తమకు కావలిసిన విధంగా మార్చుకోవడానికి వీలుంటుంది. ఈ ఫీచర్ సహాయంతో, ఫోటోలను వాటి అసలు నాణ్యతతో పంపడం సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది.

వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పని

వాట్సాప్ కస్టమర్‌లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో బీటా వెర్షన్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ ని చూడవచ్చు. సాధారణ వాట్సాప్ వినియోగదారులకు ఈ ఫీచర్ ఎప్పుడు కఅందుబాటులోకి వస్తుందో ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

ఇటీవలి WABetaInfo నివేదిక ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్ లో కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం కోసం షార్ట్‌కట్‌ను మరియు అప్లికేషన్ నుండి నేరుగా వీడియోలను రికార్డ్ చేయడానికి మరియు ఫోటోలను తీయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా కొత్త ఫీచర్ ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఈ అప్‌డేట్ చేయబడిన ఫీచర్‌లు WhatsApp యొక్క Android వెర్షన్ కోసం ప్లాన్ చేసారు. మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌ను సులభంగా ఉపయోగించడానికి వీలుగా. మరో రెండు ఫీచర్లను వాట్సాప్ బీటా వెర్షన్‌లలో పరీక్షిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇంకా, ఈ కొత్త ఫీచర్లు రాబోయే నెలల్లో సాధారణ వాట్సాప్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తాయని నివేదికలో పేర్కొన్నారు.

వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పని

మరిన్ని కొత్త ఫీచర్లు

గత నెలలో, డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందడానికి కంపెనీ యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. అలాగే,ఇంటర్నెట్ షట్ డౌన్ లో కూడా మెసేజ్ లు పంపే విధంగా వాట్సాప్ తమ సర్వీస్ లకు ప్రాక్సీ సపోర్టు ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త Proxy ఫీచర్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు కంపెనీ సర్వర్‌లకు వారి కనెక్షన్ బ్లాక్ చేయబడినా లేదా అంతరాయం కలిగినా కూడా వాట్సాప్ ని ఉపయోగించడం కొనసాగించవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Planning To Introduce New Feature That Allows User To Share Images In Their Original Quality

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X