Samsung కొత్త ట్యాబ్‌లు S7, S7+ లు వచ్చేసాయి!! ఫీచర్స్ బ్రహ్మాండం

|

ఇండియాలో ఎట్టకేలకు శామ్సంగ్ సంస్థ తన గెలాక్సీ టాబ్ S7 మరియు గెలాక్సీ టాబ్ S7 + లను విడుదల చేసింది. గెలాక్సీ టాబ్ S7 LTE మరియు వై-ఫై మోడళ్లలో విడుదల కాగా గెలాక్సీ టాబ్ S7+ కేవలం LTE వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారతీయ మార్కెట్ లో ఈ ట్యాబ్‌ల యొక్క రెండు వేరియంట్‌లు ప్రస్తుతం కొన్ని డిస్కౌంట్లతో ప్రీ-బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ ధరల వివరాలు

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ సంస్థ తన గెలాక్సీ టాబ్ S7 రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో వై-ఫై వేరియంట్‌ యొక్క ధర రూ.55,999 కాగా LTE వేరియంట్ యొక్క ధర రూ.63,999. అలాగే ఏకైక ఎల్‌టిఇ వేరియంట్‌లో విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S7+ యొక్క ధర రూ.79,999. ఈ టాబ్లెట్లన్నీ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రోన్జ్ మరియు మిస్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ సేల్స్

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ సేల్స్

శామ్‌సంగ్ యొక్క రెండు కొత్త గెలాక్సీ ట్యాబ్‌లు ఆగస్టు 26 నుండి ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంచాయి. గెలాక్సీ టాబ్ S7 వై-ఫై వేరియంట్ రిలయన్స్ రిటైల్ మరియు శామ్సంగ్ షాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఎల్‌టిఇ వేరియంట్‌లు రెండూ శామ్‌సంగ్ షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మరియు రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించబడతాయి.

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్స్

గెలాక్సీ టాబ్ S7 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్స్

గెలాక్సీ టాబ్ S7 ను ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులు కీబోర్డు కవర్‌ను రూ .10,000 తగ్గింపు ధరతో పొందగలుగుతారు. దీని ధర సాధారణంగా రూ .15,999. అదనంగా, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ కస్టమర్లు రూ .5 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందటానికి అర్హులు. అలాగే గెలాక్సీ టాబ్ S7+ ను కొనుగోలు చేసిన వినియోగదారులు రూ .6 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందటానికి అర్హులు అవుతారు.

Also Read:Sony Bravia కొత్త LED టీవీలు వచ్చేసాయి!!! ప్లే స్టేషన్ ఫీచర్లతోAlso Read:Sony Bravia కొత్త LED టీవీలు వచ్చేసాయి!!! ప్లే స్టేషన్ ఫీచర్లతో

గెలాక్సీ టాబ్ S7 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ టాబ్ S7 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ యొక్క కొత్త గెలాక్సీ టాబ్ S7 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ SoC ద్వారా రన్ అవుతూ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 10 ద్వారా రన్ అవుతూ 274ppi పిక్సెల్ సాంద్రతతో 11-అంగుళాల WQXGA LTPS TFT డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ 8,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జీపై 3 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

గెలాక్సీ టాబ్ S7 కెమెరా సెటప్‌

గెలాక్సీ టాబ్ S7 కెమెరా సెటప్‌

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S7 యొక్క ఫోటోగ్రఫీ విషయానికొస్తే దీని వెనుకభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరా జత చేయబడి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో f / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.

గెలాక్సీ టాబ్ S7+ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ టాబ్ S7+ స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ యొక్క రెండవ టాబ్లెట్ గెలాక్సీ టాబ్ S7 + యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 12.7-అంగుళాల WQXGA + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 287ppi పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతును ఇస్తుంది. ఇది 6GB LPDDR5X RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి ఉండి స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా మెమొరిని 1TB వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్‌ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 10,090mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

గెలాక్సీ టాబ్ S7+కనెక్టివిటీ ఎంపికలు

గెలాక్సీ టాబ్ S7+కనెక్టివిటీ ఎంపికలు

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S7 + యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే 4G సిమ్ స్లాట్, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. గెలాక్సీ టాబ్ ఎస్ 7 +లో కూడా స్టాండర్డ్ వెర్షన్‌లో ఉన్న ఫ్రంట్ మరియు రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రెండు పరికరాలు మెరుగైన ఎస్ పెన్‌తో వస్తాయి. ఇది ఎయిర్ సంజ్ఞలకు మద్దతు ఇస్తుంది. అలాగే స్కెచ్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Tab S7 and S7+ Released in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X