వాట్సప్‌లో మరో దిమ్మతిరిగే ఫీచర్

Written By:

కొత్త కొత్త మార్పలతో కష్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న వాట్సప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎంతదూరంలో ఉన్నారు..ఎక్కడ కలవాలనుకుంటున్నారు అనేది ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్ర‌స్తుతం ఇండియాలో వాట్స‌ప్‌కు 16 కోట్ల మంది యూజ‌ర్స్ ఉన్నారు. 50 భాష‌ల్లో అందుబాటులో ఉంది.

బెస్ట్ సెల్ఫీ కోసం బెస్ట్ కెమెరా యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాబీటాఇన్ఫో

వాట్స‌ప్‌కు సంబంధించిన స‌మాచారాన్ని లీక్ చేసే ట్విట్ట‌ర్‌లోని వాబీటాఇన్ఫో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

కావాలంటే డిసేబుల్

ఈ కొత్త ఫీచ‌ర్ ఐవోఎస్ బీటా వ‌ర్ష‌న్ 2.17.3.28, ఆండ్రాయిడ్ 2.16.399, ఆపై వెర్ష‌న్ల‌లో ప‌నిచేస్తుంది. కావాలంటే దీనిని డిసేబుల్ కూడా చేసుకోవ‌చ్చు.

షో మై ఫ్రెండ్స్‌

ఈ ఫీచర్ ద్వారా వాట్సప్‌ గ్రూపులో లైవ్‌ లొకేషన్‌ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకోసం ‘షో మై ఫ్రెండ్స్‌' అనే ఆప్షన్‌ను చేర్చనున్నారు.

గ్రూపులోని మిగిలిన వ్యక్తులు

దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్దేశించుకునే వీలు కల్పిస్తున్నారు. స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.

స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు

ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు దారి తెలీక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ సదుపాయం పనికొస్తుంది.

మరికొద్దిరోజుల్లో

మరికొద్దిరోజుల్లో ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New WhatsApp feature will let you track your friends' location in real-time read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot