సూపర్ మారియో గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసింది..

Written By:

సూపర్ మారియో గేమ్ తెలుసా...నీలం రంగు జుబ్బా.. ఎరుపు రంగు టోపి పెట్టుకుని పరుగెత్తుకుంటూ అడ్వెంచర్లతో దూసుకెళ్లే బుడతడి గేమ్.

1990లలో ఓ వెలుగు వెలిగిన గేమ్. వీడియో గేమ్ పార్లర్లు ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఈ గేమ్ కోట్లాది మందిని అలరించింది. ఇంట్లోని టీవీల్లో సైతం ఈ గేమ్‌ను ఆడుకున్నవారి సంఖ్య కోకొల్లలు. అయితే స్మార్ట్‌ఫోన్ యుగం ప్రవేశించిన తరువాత సూపర్ మారియోను మెల్లగా మరచిపోయారు. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ఈ రోజు స్పెషల్ డీల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేటి నుంచి ఆండ్రాయిడ్ వర్షన్ లో

అయితే గత సంవత్సరం నింటెండో సంస్థ ఇదే గేమ్ ను ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మార్చి తీసుకురాగా, సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఈ గేమ్ ను నేటి నుంచి ఆండ్రాయిడ్ వర్షన్ లో విడుదల చేసినట్టు సంస్థ తెలిపింది.

తొలి నాలుగు రోజుల్లోనే

లాంచ్ అయిన తొలి నాలుగు రోజుల్లోనే 40 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ అయింది, ఆపై ఈ సంవత్సరం జనవరి వరకూ 7.8 కోట్ల డౌన్‌లోడ్‌లతో సత్తా చాటింది.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రీ రిజిస్టర్

ఈ సూపర్ మారియో గేమ్‌ను, స్వల్ప మార్పులతో అందుబాటులోకి తెచ్చి, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రీ రిజిస్టర్ ను ప్రకటించింది. అయితే ఈ మార్పులు గేమ్ సేల్ పై ప్రభావం చూపే అవకాశముందని కొందరంటున్నారు.

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో కూడా ఇక నుంచి సూపర్ మారియో రన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

ఏపీకే మిర్రర్ నుంచి

ఒకవేళ డౌన్‌లోడ్ కావాలనుకునే వారు ఏపీకే మిర్రర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆండ్రాయిడ్ లో ఈ గేమ్ లాంచ్ తో పాటు ఐఓఎస్ లోనూ దీన్ని అప్ డేట్ చేశారు. ఐఓఎస్ లో మాదిరిగా ఆండ్రాయిడ్ లోనూ ఇది సక్సెస్ సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Super Mario Run Now Available on Android; iOS Version Gets an Update read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot