ఫస్ట్ టైం 1Gbps ప్లాన్ వచ్చేసింది, అదీ హైదరాబాద్‌లో..
ACT Fibernet తొలిసారిగా సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇంతవరకు ఏ టెల్కోలకు సాధ్యం కాని 1Gbps డేటా ప్లాన్‌ని కష్టమర్లకు అందించేందుకు రెడీ అయింది.
ACT Fibernet తొలిసారిగా సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇంతవరకు ఏ టెల్కోలకు సాధ్యం కాని 1Gbps డేటా ప్లాన్‌ని కష్టమర్లకు అందించేందుకు రెడీ అయింది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. హైదరాబాద్ లోని తాజ్ కృష్టాలో జరిగిన ఈవెంట్‌లో ACT Fibernet ఈ ప్లాన్ లాంచ్ చేసింది. ప్లాన్ వివరాలేంటో ఓ లుక్కేయండి.

నెలకి రూ. 5999 చెల్లించడం ద్వారా
యూజర్లు నెలకి రూ. 5999 చెల్లించడం ద్వారా 1Gbpsతో కూడిన డేటాను అందుకుంటారు. నెలకి 1టిబి వరకు యూజర్లు వాడుకోవచ్చు.

త్వరలో 11 నగరాలకు
మొదటగా ఈ సర్వీసును తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఇదే సర్వీసును అతి త్వరలో 11 నగరాలకు విస్తరించనున్నట్లు ACT సీఈఓ బాల మల్లాది తెలిపారు.

ఎటువంటి టెలికం లైసెన్స్ లేదు
ఇంకా విచిత్రమేమిటంటే ACT Fibernetకి ఎటువంటి టెలికం లైసెన్స్ లేదు. అయినప్పటికీ Fiber- optic టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తోంది.

దేశంలోనే తొలిసారిగా 1Gbps స్పీడ్ తో
దేశంలోనే తొలిసారిగా 1Gbps స్పీడ్ తో బ్రాడ్ బాండ్ సర్వీసును అందిస్తున్న ఏకైక సంస్థ ACT Fibernet మాత్రమే. ఈ ఇంటర్నెట్ సేవలను మరే isp ఇండియాలో అందిచడం లేదు.

సామాన్యులకు చాలా భారం
ఈ ప్లాన్ సామాన్యులకు చాలా భారంగా మారనుంది. కార్పోరేట్ యూజర్లకి అలాగే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న సంస్థలకి 1Gbps ప్లాన్ యూజ్ అవుతుందని ACT Fibernet ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








