డేంజర్ జోన్‌లో లక్ష హెచ్‌పీ ల్యాపీలు

Written By:

బ్యాటరీ పేళుళ్లతో అల్లాడిన శాంసంగ్‌కు తోడుగా ఇప్పుడు హెచ్‌పి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. హెచ్‌పి రిలీజ్ చేసిన కొన్ని మోడళ్ల ల్యాప్‌టాప్‌లలో లిథియం- అయాన్‌ బ్యాటరీల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని 'అమెరికన్‌ జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌(సీపీఎస్‌సీ)' తేల్చింది. ఈ సమస్య కారణంగా బ్యాటరీలు అధికంగా వేడెక్కి పేలిపోయే ప్రమాదముందని నోటీసు జారీ చేసింది.

ఫిబ్రవరి 3న దూసుకొస్తున్న సెల్ఫీ కింగ్.. ఒప్పో ఎ57

డేంజర్ జోన్‌లో లక్ష హెచ్‌పీ ల్యాపీలు

అందుకు స్పందించిన హెచ్‌పీ వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. మార్చి 2013 నుంచి అక్టోబర్‌ 2016 వరకు అమ్మిన దాదాపు ఒక లక్ష ఒక వెయ్యి ల్యాప్‌టాప్‌లలో ఈ సమస్య ఉన్నట్లు హెచ్‌పీ సంస్థ గుర్తించింది. వెంటనే ఆ బ్యాటరీలను వెనక్కి ఇచ్చేయాలని వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను ఉచితంగా అమర్చుతామని వినియోగదారులను కోరింది.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం సెక్యూరిటీ టిప్స్

డేంజర్ జోన్‌లో లక్ష హెచ్‌పీ ల్యాపీలు

హెచ్‌పీ.. కంపాక్‌.. హెచ్‌పీ ప్రోబుక్‌.. హెచ్‌పీ ఎన్‌వీ.. కంపాక్‌ ప్రెసారియో.. హెచ్‌పీ పెవిలియన్‌ మోడల్‌ ల్యాప్‌టాప్‌లలోని బ్యాటరీల్లో ఈ సాంకేతిక సమస్య ఉందట. బ్యాటరీలపై ఉండే బార్‌కోడ్‌లు6BZLUM 6CGFK, 6CGFQ, 6CZMB, 6DEMA, 6DEMH, 6DGAL, 6EBVAలతో ప్రారంభమైతే తక్షణమే వాటిని ల్యాప్‌టాప్‌ల నుంచి తొలగించి తమను సంప్రదించాలని హెచ్‌పీ వినియోగదారులకు సూచించింది.

 

English summary
HP recalls 101,000 laptop batteries over fire concerns read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot