ఫిబ్రవరి 3న దూసుకొస్తున్న సెల్ఫీ కింగ్.. ఒప్పో ఎ57

Written By:

ఒప్పో నుంచి మరో సరికొత్త ఫోన్ దూసుకురానుంది. ఎ57 పేరుతో రానున్న ఈ ఫోన్ ఫిబ్రవరి3న వినియోగదారులకు ముందుకు తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ధర దాదాపు 16,000గా ఉండే అవకాశం ఉంది. సెల్పీ ఎక్స్ఫర్ట్ అయిన ఒప్పో నుంచి రానున్న ఈ ఫోన్ కూడా సెల్పీ ప్రియులను ఎంతగానో అలరిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫీచర్లు కూడా ఇతర ఫోన్లకు ధీటుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

బ్లాక్‌బెర్రి చివరి స్మార్ట్‌ఫోన్, లాంచింగ్‌కు రెడీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5.2 ఇంచ్ హెచ్డీ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. బరువు 147 గ్రాములు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అదనపు ఆకర్షణలు

ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ఫిబ్రవరి3న ఇండియాలో

ఫోన్ ధర విషయానికొస్తే రూ. 16,000 లకు ఇది లభించే అవకాశం ఉంది. న కంపెనీ ఫిబ్రవరి3న ఇండియాలో అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఆ రోజు నుంచే అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే చైనాలో విడుదలయన ఈ ఫోన్ అక్కడ భారీ స్థాయిలోనే అమ్మకాలను కొల్లగొట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo A57 ‘unstoppable’ selfie smartphone to launch in India on 3 February read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot