‘లెనోవో లీప్యాడ్ A1-07’.. నాలుగు రంగుల్లో..!!

Posted By: Super

‘లెనోవో లీప్యాడ్ A1-07’.. నాలుగు రంగుల్లో..!!

టాబ్లెట్ పీసీ మార్కెట్లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిస్తున్న ‘లెనోవో’ (Lenovo), ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న‘లీప్యాడ్ A1-07’ టాబ్లెట్ పై సర్వత్రా గోప్యత నెలకుంది. 7 అంగుళాల స్టైలిష్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ‘లెనోవో లీ ప్యాడ్ A1-07’, 1024 x 600 పిక్సల్ రిసల్యూషన్ కలిగి, ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు 2.3 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దకుంది.

ఓమ్యాప్ (OMAP) ప్రొసెస్సింగ్ వ్యవస్థను ‘లీప్యాడ్’లో ప్రవేశపెట్టారు. ఇంటర్నల్ మెమరీకి సంబంధించి 512 MB మెమరీ సామర్ధ్యం కలిగిన ర్యామ్, 16 జీబీ స్పేస్ కలిగి ఉంటుంది. కెమెరా విషయానికొస్తే ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు నాణ్యమైన వీడియో ఛాటింగ్‌తో పాటు, సహజ సిద్ధమైన ఫోటోలు తీసుకునేందుకు ఉపకరిస్తాయి. ‘లీప్యాడ్’లో పొందుపరిచిన ‘బ్రాడ్‌కామ్ చిప్’ టాబ్లెట్ పనితీరును మెరుగుగా కనబర్చే శక్తిని సమకూరుస్తుంది.

అత్యుత్తమ పనితీరు కలిగిన వై - ఫై కనెక్టువిటీ వ్యవస్థను ‘లీ ప్యాడ్’లో పొందుపరిచారు. ‘లెనోవో లీప్యాడ్ A1-07’ మోడల్‌ను ఇప్పటికే చైనాలో విడుదల చేశారు. అయితే ఈ టాబ్లెట్ లోని పలు వర్షన్‌లను ఆధునీకరించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరుకు ‘లీప్యాడ్’ టాబ్లెట్ 3జీ కనెక్టువీటి కలిగి ఉంటుందని తెలుస్తోంది.ఇక బ్యాటరీ విషయానికొస్తే ఐయోనిక్ 3550 mAh బ్యాటరీని పొందుపరిచినట్లు సమాచారం.

ఇక ‘లీప్యాడ్’ కొలతలన పరిశీలిస్తే 195 x 125 x 11.95 mm దారుఢ్యం కలిగి, 400 గ్రాములు బరువు ఉంటుంది. ‘బ్లూటూత్ రేడియో’ అధునాతన ఫీచర్ ను ఈ టాబ్లెట్లో పొందుపరిచారు. విడుదలకాబోతున్న ‘లీప్యాడ్’ నలుపు, తెలుపు, బ్లూ, పింక్ వంటి వైబ్రంట్ రంగులలో లభ్యమవునున్నట్లు తెలుస్తోంది. ‘లీప్యాడ్’ ధరకు సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot