సామ్‌సంగ్ నుంచి చవక ధర ట్యాబ్లెట్ వచ్చేస్తోంది!

|

టాబ్లెట్ కంప్యూటర్‌ మార్కెట్‌ను శాసించే క్రమంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, సీఈఎస్ 2014 వేదికగా తన గెలాక్సీ సిరీస్ నుంచి నాలుగు సరికొత్త టాబ్లెట్‌లను ప్రకటించిన సామ్‌సంగ్ తాజాగా ‘గెలాక్సీ టాబ్ 3 లైట్ 7.0' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీని అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రత్యేకించి ఇండియా ఇంకా చైనా మార్కెట్లను టార్గెట్ చేస్తూ రూపొందించబడిన ఈ మధ్య ముగింపు టాబ్లెట్ యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండటం విశేషం. గెలాక్సీ టాబ్ 3 లైట్ 7.0 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

 
సామ్‌సంగ్ నుంచి చవక ధర ట్యాబ్లెట్  వచ్చేస్తోంది!

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1,024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమెరీని విస్తరించుకునేు సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ - ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, వై-ఫై డైరెక్ట్, యూఎస్బీ 2.0, జీపీఎస్ ఇంకా సామ్‌సంగ్ అప్లికేషన్స్),
3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( సింగిల్ రీఛార్జ్ పై 8 గంటల వీడియో ప్లేబ్యాక్),
ట్యాబ్ మందం 9.7 మిల్లీమీటర్లు, బరువు 310 గ్రాములు.

బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయంట్‌లలో లభ్యంకానున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ డివైస్ ధర ఇంకా ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరం విలువ ఇంచుమించుగా రూ.12,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీ నుంచి రాబోతున్న ఈ మధ్య ముగింపు టాబ్లెట్ మార్కెట్లో ఇప్పటికే కొలువుతీరి ఉన్న డజన్ల కొద్ది దేశవాళీ బ్రాండ్‌ల ట్యాబ్లెట్‌లకు పోటీకానుంది.

సీఈఎస్ 2014 వేదికగా సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి నాలుగు సరికొత్త టాబ్లెట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్‌సంగ్ కొత్త టాబ్లెట్ మోడల్స్ వివరాలను పరిశీలించినట్లయితే ముందుగా గెలాక్సీ నోట్ ప్రో మోడల్ గురించి తెలుసుకుందాం..సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌ప్రో మూడు డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యంకానుంది. గెలాక్సీ టాబ్‌ప్రో 12.2 (12.2 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్), గెలాక్సీ టాబ్‌ప్రో10.1 (10.1అంగుళాల డిస్‌ప్లే వేరియంట్). గెలాక్సీ టాబ్‌ప్రో8.4(8.4 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X