మంటతో ఫోన్ ఛార్జింగ్, వంట కూడా చేసుకోవచ్చు

Written By:

మార్కెట్లోకి రోజురోజుకు సరికొత్త గాడ్జెట్స్ వస్తున్నాయి. వాటితో మనం డిఫరెంట్ పనులు చేయవచ్చు. అలాంటి గాడ్జెట్లలో ఓ గాడ్జెట్ బయోలైట్ క్యాంప్ స్టవ్. ఈ స్టవ్ మండుతుంటే మనం మన ఫోన్లను ఇతర డివైస్ లను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతే కాదు. ఆ మంట మీద మనం అన్ని రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. వంట అయ్యేలోపు ఛార్జింగ్ కూడా పూర్తి అయిపోతుందని కంపెనీ చెబుతోంది.

Bsnl అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివైస్‌లకు ఎంచక్కా చార్జింగ్

బయోలైట్ క్యాంప్ స్టవ్ అనే గాడ్జెట్‌తో ఓ వైపు మంట పెట్టి అవసరం ఉన్న వంట వండుతూనే మరోవైపు దాని ద్వారా ఆయా డివైస్‌లకు ఎంచక్కా చార్జింగ్ పెట్టుకోవచ్చు.

యూఎస్‌బీ పోర్టులు

స్టవ్‌లో మంట పెట్టడం వల్ల ఉద్భవించే వేడిని విద్యుత్ శక్తిగా మార్చే ఓ పరికరం ఆ స్టవ్‌కు ఓ వైపు అమర్చబడి ఉంటుంది. దానికి యూఎస్‌బీ పోర్టులు కూడా ఉంటాయి. వాటికే ఫోన్ లేదా పవర్‌బ్యాంక్, యూఎస్‌బీ లైట్ వంటి గ్యాడ్జెట్లను చార్జింగ్ పెట్టుకోవచ్చు.

పిక్‌నిక్‌లు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు

కొంతమంది పిక్‌నిక్‌లు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు ఒక్కోసారి అక్కడ ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. దీంతో ఫోన్‌లలో చార్జింగ్ అనేది సమస్యగా మారుతుంది.

ఒకేసారి రెండు పనులు

దీనికి తోడు ఆయా ప్రదేశాల్లో ఆహారం వండుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలోనే పైన చెప్పిన బయోలైట్ క్యాంప్ స్టవ్ ద్వారా ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు. ఓ వైపు ఆహారం వండుతూనే మరో వైపు ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.

4.5 నిమిషాల్లోనే 1 లీటర్ నీటిని

ఈ స్టవ్ కేవలం 4.5 నిమిషాల్లోనే 1 లీటర్ నీటిని మరిగించగలదు. అంతేకాదు దీనికి ఫోన్‌ను 20 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు, దాంతో 60 శాతం వరకు ఫోన్ బ్యాటరీకి కావల్సిన శక్తి లభిస్తుంది.

రూ.20,400

ఈ స్టవ్ ధర మాత్రం కాస్తంత ఎక్కువే. రూ.20,400 కు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BioLite CampStove charge your Phone with fire read more ar gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot