మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?

అయితే ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

|

మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

నోకియా 8 వచ్చేసింది.. ఇదుగోండి మొదటి లుక్, స్పెసిఫికేషన్స్నోకియా 8 వచ్చేసింది.. ఇదుగోండి మొదటి లుక్, స్పెసిఫికేషన్స్

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లింది. హోమ్ పేజీలో Verify Email/Mobile Number పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది.

స్టెప్ 2

స్టెప్ 2

ఆ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఆయా ఖాళీలలో ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ పక్రియ పూర్తి అయిన తరువాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి క్రింద కనిపించే Get One Time Password పై క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవే అయినట్లయితే మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే Enter OTP ఫీల్డ్‌లో ఎంటర్ చేసినట్లయితే "Congratulations! The Email ID matches with our records!","Congratulations! The Mobile Number matches with our records!" పేరుతో సిస్టం పై మెసేజ్ వస్తుంది. ఇలా వచ్చినట్లయితే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ మీ పేరు మీదే ఉన్నట్లు నిర్థారించుకోవచ్చు.

మొబైల్ నెంబర్‌ను మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే..?

మొబైల్ నెంబర్‌ను మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే..?

Verify Email/Mobile Number పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన మొబైల్ నెంబర్‌ను మాత్రమే ఎంటర్ చేయవల్సి ఉంటుంది. తరువాత సెక్యూరిటీ కోడ్‌‌ను కూడా ఎంటర్ చేసి క్రింద కనిపించే Get One Time Password పై క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవే అయినట్లయితే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే Enter OTP ఫీల్డ్‌లో ఎంటర్ చేసినట్లయితే "Congratulations! The Mobile Number matches with our records!" పేరుతో సిస్టం పై మెసజ్ వస్తుంది.

మెయిల్ ఐడీని మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే..?

మెయిల్ ఐడీని మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే..?

Verify Email/Mobile Number పేజీలో మీ ఆధార్ నెంబర్ తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన ఈమెయిల్ ఐడీని మాత్రమే ఎంటర్ చేయవల్సి ఉంటుంది. తరువాత సెక్యూరిటీ కోడ్ ను కూడా ఎంటర్ చేసి క్రింద కనిపించే Get One Time Password పై క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవే అయినట్లయితే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే Enter OTP ఫీల్డ్‌లో ఎంటర్ చేసినట్లయితే "Congratulations! The Email ID matches with our records!" పేరుతో సిస్టం పై మెసజ్ వస్తుంది.

Best Mobiles in India

English summary
Aadhaar Card: How to Verify Your Phone Number Using UIDAI Website. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X