వైఫై సిగ్నల్ పెరగడం లేదా..?

Written By:

ఇప్పుడు ఎక్కడ చూసినా వైఫై అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంటర్నెట్ కేబుల్ పెట్టుకుని దానికి వైఫై కవరేజి పెట్టేస్తున్నారు. ఒకేసారి ఇంట్లోని అన్ని డివైజ్ లకు కనెక్ట్ కావాలంటే వైఫైనే అత్యుత్తమం కూడా..అయితే కొన్ని సార్లు వైఫై సరిగా పనిచేయకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఈ కారణాలు కూడా కావచ్చు మీ ఇంట్లో వైఫై ఉంటే చెక్ చేసుకోండి.

100 నిమిషాలు ఉచిత టాక్ టైంతో పాటు మరిన్ని ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 రూటర్ ప్లేస్

ఇంట్లో రూటర్ పరిధి 100 అడుగుల వరకు ఉంటుంది. ఇంట్లో కవరేజ్ అన్ని చోట్ల సరిగా లేదంటే వైఫై రూటర్ సెంటర్ ప్లేస్ లో లేదని అర్థం. కాబట్టి రూటర్ ని ఇంట్లో మధ్య ప్రదేశంలె ఎత్తులో ఉండేలా చూసుకోండి. గోడల దగ్గర అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర ఉంచవద్దు. అలా చేస్తే సిగ్నల్ సమస్యలు వస్తాయి.

యాంటెనా

రూటర్ తో పాటు యాంటెనూ కూడా మీకు వస్తుంది. అయితే సిగ్నల్ మెరుగుకోసం ఎక్సటర్నల్ యాంటెనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని ఎంచుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవి పరిధిని పెంచి సిగ్నల్స్ బాగా అందేలా చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూటర్ సాప్ట్‌వేర్

రూటర్ను అమర్చుకున్నాక దాని సాఫ్ట్వేర్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కొన్ని రూటర్స్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ పవర్ అడ్డస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ట్రాన్స్మిషన్ పవర్ను పెంచుకోవడం ద్వారా కవరేజ్ ఏరియాను పెంచుకోవచ్చు. అంతేకాకుండా డీఫాల్ట్గా ఉన్న వైర్లెస్ బ్రాడ్కాస్ట్ చానల్ నుంచి మరొకదానికి మారడం ద్వారా వైఫై సిగ్నల్స్ను ఇంప్రూవ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

సెక్యూరిటీ

ఒకవేళ రూటర్ సెట్టింగ్స్ మార్చుకోవడం మొదటిసారైతే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ముందుగా మీకు రూటర్ ఐపీ అడ్రస్ తెలుసుండాలి. కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి (విన్ + ఆర్ సెలక్ట్ చేసి సీఎండీ అని టైప్ చేయాలి) ఐపీకన్ఫిగర్ టైప్ చేయాలి. ఒకసారి ఐపీకన్ఫిగర్ ఓపెన్ అయ్యాక ఐపీ అడ్రస్ డీఫాల్ట్ గేట్వేని ఎంచుకోవాలి. వైఫై నెట్వర్క్ మరింత సెక్యూర్గా ఉండాలంటే డబ్బుపీఏ2-ఏఈఎస్ టైప్ సెక్యూరిటీని ఎంచుకోవాలి.

అన్ లాక్

మీ వైపై ఎన్ని డివైస్ లో నడుస్తుందో అనేది వెర్ లైస్ వాచర్ అనే సాప్ట్ వేర్ ద్వారా తెలుసుకోవచ్చు దీన్ని ఉచితంగానే పొందవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వైఫైని స్కాన్ చేస్తుంది. నెట్వర్క్తో కనెక్ట్ అయిన డివైజ్ల లిస్ట్ను చూపిస్తుంది. ఒకవేళ ఇది పనిచేయకపోతే రూటర్ సెట్టింగ్స్ పేజ్లోకి వెళ్లి కనెక్టెడ్ డివైజెస్ సెక్షన్ని ఎంచుకుంటే సరిపోతుంది.

వేరే రూటర్లతో..

మీ రూటర్ మీ ఇంటి పక్క వాళ్ల రూటర్ తో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల సిగ్నల్స్ తగ్గిపోతాయి. ఒకవేళ మీ చానెల్ ఇంటరప్ట్ అవుతున్నట్లయితే వైఫై అనలైజర్ సహాయంతో పర్ఫెక్ట్ చానెల్ను ఎంచుకోవచ్చు. దీనివల్ల సిగ్నల్స్ సమస్య తొలగిపోతుంది.

సిగ్నల్ బూస్ట్

రూటర్ రేంజ్ పెరగాలంటే మరో మంచి మార్గం dd wrt firmware ఇన్‌స్టాల్ చేసుకోవడం. దీనివల్ల సెక్యూరిటీ లభించడంతో పాటు ట్రాన్సిమిటింగ్ పవర్ను బూస్ట్ చేసుకోవచ్చు. వైఫై రేంజ్ సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇది మంచి ఆప్షన్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s How You Can Improve the Wi-Fi Signal in Your Home read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot