100 నిమిషాలు ఉచిత టాక్ టైంతో పాటు మరిన్ని ఆఫర్లు..

Written By:

ఎయిర్‌టెల్ దుమ్మురేపుతోంది. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల వైపు పరుగులు పెడుతుంటే ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుతో ఈ చెల్లింపుల వైపు పరుగులు పెడుతోంది. దేశంలోనే తొలి పేమెంట్ బ్యాంకుగా సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఇటీవలే ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టాక్ టైం ఇస్తామంటూ సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది అలా ఉండగానే ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్‌తో దూసుకొస్తోంది.

జియో తర్వాత ముఖేష్ అంబాని మాస్టర్ ప్లాన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 నిమిషాల మొబైల్ టాక్ టైం

ఇటీవల ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టైం ఫ్రీ అని ప్రకటించిన పేమెంట్ బ్యాంకు తమ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపిన ఎయిర్‌టెల్ ఖాతాదారులకు 100 నిమిషాల మొబైల్ టాక్ టైంను ఉచితంగా అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతీనెలా దాదాపు లక్షమంది ఖాతాదారులకు

తమ బ్యాంకు ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిపిన వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ఈ ఆఫర్ అందించనున్నట్టు పేమెంట్ బ్యాంక్ తెలిపింది ప్రతీనెలా దాదాపు లక్షమంది ఖాతాదారులకు వంద నిమిషాల టాక్ టైంను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది.

డిజిటల్ ఇండియా' విజన్ కు

ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్ కు తాము కట్టుబడి ఉన్నామని, దేశాన్ని క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది మావంతు సహాయం అని బ్యాంక్ సీఈవో, ఎండీ శశి అరోరా తెలిపారు. భారతదేశం అంతటా జనవరి 2017 నుంచి మరికొన్ని ఆఫర్లు అందించనున్నట్టు కూడా తెలిపారు.

ఉచిత డిజిటల్ చెల్లింపులు

డిజిటల్ లావాదేవీలకు ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ తన వినియోగదారులు, వ్యాపారులు, భాగస్వాముల నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు. ఉచితంగా ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి హిడెన్ అండ్ యాడెడ్ చార్జీలు ఉండవు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యం.

క్యాష్ విత్ డ్రాలపై 0.65 శాతం చార్జ్

260 మిలియన్లకు పైగా ఉన్న తన వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు ప్రయోజనాలపై అవగాహన కల్పించనుంది. ఇందులో భాగంగా క్యాష్ విత్ డ్రాలపై 0.65 శాతం కూడా చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. దీని ద్వారా డిజిటల్ చెల్లింపులవైపు కస్టమర్లు మొగ్గు చూపుతారని బ్యాంక్ భావిస్తోంది.

పేపర్ లెస్ వ్యవస్థ

దీంతో పాటు పేపర్ లెస్ వ్యవస్థను తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఒక యాప్ (స్మార్ట్ ఫోన్) సహాయంతో గానీ, యుఎస్ఎస్‌డీ (ఫీచర్ ఫోన్) ద్వారాగానీ లావాదేవీలు జరిపేలాఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Payments Bank pushes e-payments, offers free 100 minutes talktime on mobiles Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting