కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ వెలగాలా..?

తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మరింత క్రియేటివ్‌గా వాడుకోవాలని చాలా మంది యూజర్లు తాపత్రయపడుతుంటారు. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ ప్రత్యేక ఫీచర్లకు సంబంధించి స్పెషల్ ఇంట్రస్ట్ స్టోరీలను గిజ్‌బాట్ బృందం నిత్యం పోస్ట్ చేయటం జరుగుతోంది.

మీ ఫోన్‌‌‌లో వాట్సాప్ ఫోటోలు ఎక్కువైపోతున్నాయా..?

కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ వెలగాలా..?

కాల్ రిసీవ్ చేసుకున్న ప్రతిసారి ఫోన్ కెమెరా ఫ్లాష్‌‌లైట్ వెలిగేలా చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన ట్రిక్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు యాడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ సైలంట్‌లో ఉన్నప్పటికి కాల్‌ను సునాయాశంగా గుర్తించవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Flash Alerts 2 యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫోన్‌కు సంబంధించిన ఫ్లాష్‌లైట్, ఇన్‌కమ్మింగ్ కాల్స్ అలానే నోటిఫికేషన్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

స్టెప్ 2

యాప్ లాంచ్ అయిన తరువాత ఓ టెస్ట్‌ను మీరు కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. యాప్ హోమ్ పేజీలోని ఆన్‌స్ర్కీన్ నోటిఫికేషన్స్ ఫాలో అవ్వటం ద్వారా ఈ టెస్ట్‌ను పూర్తి చేయవచ్చు.

ఈ వారం విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

స్టెప్ 3

తదుపరి చర్యలో భాగంగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి incoming Call ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. సెట్టింగ్‌ను అప్‌డేట్ చేసిన తరువాత ఫోన్‌ను రీబూట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 4

రీబూట్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను ఓపెన్ చేసి మరోసారి incoming Call ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, ఆ తరువాత నుంచి మీరు రిసీవ్ చేసుకునే ప్రతి‌కాల్‌కు LED flashlight వెలుగుతుంది.

మళ్లీ ఆధార్ వెరిఫికేషన్, వివరాలు చెప్పకపోతే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Activate Android Camera Flash As Incoming Call Notification. Read More in Telugu Gizbot.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting