మీరు వాడే నంబర్‌నే జియో ప్రైమ్‌లోకి మార్చుకోవడం ఎలా..?

Written By:

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే పదం...జియో..జియో..వచ్చీ రావడంతోనే టెల్కోలకు చుక్కలు చూపించింది. ఉచిత ఆఫర్లతో ఎప్పటినుంచో పాతుకుపోయిన దిగ్గజాలను కోలుకోలేని దెబ్బతీసింది. మార్చి 31తో ఉచిత ఆఫర్ ముగిసిపోతుండటంతో అంబాని జియో ప్రైమ్ ఆఫర్‌తో పాటు టారిఫ్ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికీ చాలామంది జియో సిమ్‌ని తీసుకోని వారుంటారు. ఎప్పటినుంచో వాడుతున్న నంబర్‌ని ఎందుకు తీయడం అని చాలామంది జియోవైపు చూడటం లేదు. అయితే అలాంటి వారు ఉన్న నంబర్ తోనే జియో ప్రైమ్‌లోకి మారొచ్చు. కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు.

హెచ్‌టీసీ వన్ X10 లీకయింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ మొబైల్ నుంచి PORT పక్కన మీ మొబైల్ నంబర్ టైప్ చేసి 1900కి ఎసెమ్మెస్ చేయండి. వెరిఫేకేషన్, authentication కోసం అది ట్రాయ్ కి చేరుతుంది. వెరిఫికేషన్ పూర్తి కాగానే మీకు రిఫెరెన్స్ కోడ్ ఎసెమ్మెస్ రూపంలో వస్తుంది.

స్టెప్ట్ 2

ఫస్ట్ స్టెప్ అయిన తరువాత ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు జియో యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఆఫర్ కోడ్‌ని జనరేట్ చేసుకోవాలి.

స్టెప్ట్ 3

జియో షోరూం కెళ్లి మీకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇస్తే వాళ్లు మీకు మీ పాత నంబర్ పైనే జియో సిమ్‌ని ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ రిఫరెన్స్ కోడ్ చెప్పడం మరచిపోవద్దు.

స్టెప్ 4

మీ పాత నంబర్ మీద ఏమైనా పేమెంట్లు ఆగిపోయి ఉంటే అవి క్లియర్ చేసుకుని జియో ప్రైమ్ లోకి మారండి. లేకుంటే మీకు కన్ఫర్మేషన్ ఎసెమ్మెస్ రాదు.

స్టెప్ 5

అన్ని పేమెంట్లు క్లియర్ అయిన తరువాత మీరు మీ నంబర్‌ని జియోలోకి మార్చుకున్నట్లుగా సక్సెస్‌పుల్ అయినట్లుగా ఎసెమ్మెస్ వస్తుంది. అక్కడి నుంచి మీరు జియో ప్రైమ్ ఆఫర్ ని అలాగే జియో సేవలని పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to convert to Reliance Jio Prime: Here are 5 steps to follow read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot