ఐటీ కంపెనీల అరాచకం, తెలిస్తే షాకే!

Written By:

దేశంలో ప్రతి ఏడాది వేలాది మంది ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ కోడితే మరికొందరు జాబ్‌కి కావాల్సిన కొన్ని కోర్సులను పూర్తి చేసి జాబ్ పట్టేస్తున్నారు. అయితే చాలామంది మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారన్నది వాస్తవం. దీన్నే సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమకు అనువుగా మలుచుకుంటున్నాయి.

జియోకి కౌంటర్ అటాక్ ఇస్తున్న దిగ్గజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీతాలను పెంచకుండా వెట్టి చాకిరీ

కుప్పలు తెప్పలుగా వస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అంశాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఐటీ కంపెనీలన్నీ కుమ్మక్కై ఫ్రెషర్ల జీతాలను పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. ఈ క్రమంలో, అవి మాత్రం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి.

ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా

గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా ఐటీ సంస్థలు ఫ్రెషర్స్ జీతాలను తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఐటీ సంస్థలు ఇలా వ్యవహరించడం

ఫ్రెషర్స్ కు భారత ఐటీ సంస్థలు సరైన జీతాలు ఇవ్వడం లేదని , వీరి జీతాలు పెరగకుండా టాప్ ఐటీ కంపెనీలన్నీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఐటీ సంస్థలు ఇలా వ్యవహరించడం ఈ రంగానికి అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రూ.3.5 లక్షలు

20 ఏండ్ల క్రితం ఏడాదికి రూ.2.25 లక్షల స్థాయిలో వేతనాన్ని అందుకున్న ఫ్రెషర్లు.. ప్రస్తుతం రూ.3.5 లక్షలు మాత్రమే అందుకుంటున్నారన్నారు. ఇది దేశీయ ఐటీ పరిశ్రమకు మంచిది కాదని, వెనువెంటనే జీతాలను పెంచాలని ఆయన సూచించారు.

మెరుగైన జీతాలు ఇవ్వకపోతే

మెరుగైన జీతాలు ఇవ్వకపోతే ప్రతిభ ఉన్న ఫ్రెషర్స్ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపరని మోహన్ దాస్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian IT Companies Worked Together To Keep Freshers’ Salaries Low: Former Infosys CFO read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot