ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

Written By:

డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఎలా లింక్ చేయాలో తెలియదు..ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలాగో ఓ సారి చూద్దాం.

త్వరగా ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయండి, లేకుంటే పాన్ కార్డు చెల్లదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

e-filling portalలో లాగిన్

మీరు ముందుగా ఇన్ కమ్ టాక్స్ e-filling portalలో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

లాగిన్ కాగానే

మీరు లాగిన్ కాగానే మీకు అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది.

ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు

అక్కడ మీరు ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Link Now

మీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్ గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్సన్ మీకు కనిపిస్తుంది.

మొబైల్ నంబర్

దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్ కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్

ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. మీ పని అయిపోయినట్లే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
How to link PAN Card with Aadhaar Card read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot