త్వరగా ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయండి, లేకుంటే పాన్ కార్డు చెల్లదు

Written By:

డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని, లేకపోతే తమకు ఆధార్ కార్డు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలని అంటున్నారు.

విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాన్ కార్డులు నకిలీవే ఉండటంతో

దేశంలో చాలావరకు పాన్ కార్డులు నకిలీవే ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుల వాడకాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం తలపెడుతోంది. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా చాలామందికి ఆధార్ కార్డులున్నాయి.

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ

ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. అంతవరకు ఓకే గానీ, పన్నులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా చాలామంది పాన్ కార్డులు తీసుకుంటున్నారు.

అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు

ఇలాంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు పాన్ కార్డుకు ఆధార్ లింకేజి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెట్టింది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు.

దేశంలో 25 కోట్ల పాన్ కార్డులు

గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఉపయోగాన్ని క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో 25 కోట్ల పాన్ కార్డులున్నాయి. 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి. అలాగే 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొన్నా పాన్ నెంబరును రాయాల్సిందే.

పాన్ కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు

ఈ నేపథ్యంలో పాన్ కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆధార్ లింకేజిని తప్పనిసరి చేస్తే, ఇక కొత్తగా వస్తున్న కార్డులకు కూడా ఆధార్ లింకేజి ఉంటుంది కాబట్టి.. మోసాలకు తావుండదని భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New Digital India: All PAN cards not linked to Aadhaar card will be cancelled read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot