ఉచిత సేవలు కొనసాగుతాయి

Written By:

ప్రారంభ ఆఫర్‌ కిం జియో ఇస్తున్న ఉచిత సేవలు నిలిపేందుకు (స్టే ఇచ్చేందుకు) టెలికాం ట్రైబ్యునల్‌ నిరాకరించింది. అయితే ఉచిత సేవలను కొనసాగించేందుకు ఇచ్చిన అనుమతుల అంశాన్ని పునఃపరిశీలించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను, టెలికాం వివాదాల పరిష్కార, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌) ఆదేశించింది. పరిశీలనలో తేలిన విషయాలను 2 వారాల్లోగా తనకు తెలియ చేయాలని కోరింది.

అమెజాన్‌కు భారీ షాక్ తప్పదా, ఫ్లిప్‌కార్ట్ రూ.9808కోట్ల డీల్ !

ఉచిత సేవలు కొనసాగుతాయి

జియో ఉచిత ఆఫర్లు నిలిపేయాలని కోరుతూ భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌ దాఖలు చేసిన మధ్యంతర అప్పీల్‌పై ఆ సంస్థలతో పాటు జియో, ట్రాయ్‌ వాదనలను ఆలకించాక, ఆదేశాలను టీడీశాట్‌ గత వారంలో రిజర్వ్‌ చేసిన సంగతి విదితమే.

న్యూజిలాండ్‌కు ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి, ఎవరికంటే..?

ఉచిత సేవలు కొనసాగుతాయి

జియో ఉచిత సేవలు కొనసాగించేందుకు ట్రాయ్‌ ఇచ్చిన అనుమతిపై స్టే విధించాలని, ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైన అన్ని రికార్డులను బయట పెట్టాలని, జియో తన చందాదార్లకు ఛార్జీలు లేని టారిఫ్‌లు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా చూడాలని ఎయిర్‌టెల్‌ తన పిటిషన్‌లో కోరింది.

జియో రూ. 303లో డిస్కౌంట్ ఆఫర్

ఉచిత సేవలు కొనసాగుతాయి

90 రోజులకు మించి ఉచిత సేవలు కొనసాగించేందుకు అనుమతించడాన్ని ఐడియా కూడా ప్రశ్నించింది. నిబంధనలను అతిక్రమిస్తున్నా, ట్రాయ్‌ మౌనంగా ఉండిపోయిందని ఆరోపించాయి. అయితే జియో చేపట్టిన ప్రారంభ ఆఫర్లకు, హ్యాపీ న్యూయర్‌ ఆఫర్లకు తేడా ఉందని గుర్తించినట్లు ట్రాయ్‌ పేర్కొంది.

English summary
No stay on Reliance Jio free offer; TDSAT asks Trai to re-examine issue read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot