వాట్సాప్‌ ద్వారా టాటా స్కై అకౌంట్ బ్యాలెన్స్ & ఛానల్ ప్యాక్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

|

టాటా స్కై గత సంవత్సరం వాట్సాప్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో చేరింది. ఇప్పుడు ఈ సంస్థ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొన్ని శీఘ్ర సేవలను అందిస్తోంది. టాటా స్కై తన వాట్సాప్ సర్వీస్ కు కొత్త ఎంపికలను జతచేసింది. వినియోగదారులు వారి అకౌంట్ బ్యాలెన్స్, ఇన్‌స్టంట్ రీఛార్జ్ ఆప్షన్, ఎమర్జెన్సీ టాప్-అప్ పొందడం, ప్రస్తుత ఛానల్ ప్యాక్ వివరాలను తెలుసుకోవడం మరియు రీఛార్జ్ తర్వాత అకౌంట్ ను రిఫ్రెష్ చేయడం వంటివి అనుమతిస్తుంది.

వాట్సాప్‌ ద్వారా టాటా స్కై అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?

 

2018 లో ఈ సర్వీస్ ను ప్రారంభించినప్పుడు ఈ ఎంపికలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని టాటా స్కై తెలిపింది. అయితే అన్ని ఎంపికలను జోడించడానికి కంపెనీకి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయం పట్టింది. క్రొత్త ఎంపికల రోల్‌అవుట్‌కు ముందు టాటా స్కై తన వినియోగదారులను ఒక్కొక్కటిగా ఛానెల్‌ని జోడించడానికి లేదా తీసివేయడానికి అనుమతించింది. ఇప్పుడు చందాదారులకు మరింత స్వేచ్ఛను ఇస్తూ మరిన్ని ఎంపికలు తమ ఖాతాలో చేర్చబడ్డాయి.

వాట్సాప్‌లో టాటా స్కై యొక్క అకౌంట్ బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి?:

వాట్సాప్‌లో టాటా స్కై యొక్క అకౌంట్ బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి?:

ఇప్పుడు టాటా స్కై వాట్సాప్‌లో మీ అకౌంట్ బ్యాలెన్స్‌ను పొందే ఎంపికను జోడించింది. అయితే అలా చేయడానికి మీరు మొదట మీ రిజిస్టర్డ్ టాటా స్కై మొబైల్ నంబర్ నుండి వాట్సాప్ యొక్క వ్యాపార సేవకు సభ్యత్వాన్ని పొందాలి. అలా చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ నంబర్- +91 1800 208 6633 ను సేవ్ చేసి వాట్సాప్‌లో ఏదో ఒక మెసేజ్ పంపాలి.

వాట్సాప్ బిజినెస్‌లో టాటా స్కై అందిస్తున్న సర్వీస్ :

వాట్సాప్ బిజినెస్‌లో టాటా స్కై అందిస్తున్న సర్వీస్ :

మెసేజ్ పంపిన తరువాత టాటా స్కై బిజినెస్ సర్వీస్ అది అందించగల సేవలతో రిప్లయ్ (ప్రత్యుత్తరం) ఇస్తుంది. వినియోగదారులు ఒక ఛానెల్‌ను జతచేయడం, ఛానెల్‌ను తీసివేయడం, బ్యాలెన్స్ చెక్, పూర్తి ఛానల్ ప్యాక్ వివరాలు, తక్షణమే రీఛార్జ్ చేయండి (వెబ్‌సైట్ లింక్‌ను అందిస్తుంది), రీఛార్జ్ చేసిన తర్వాత ఖాతాను రిఫ్రెష్ చేయడం వంటి ఎనిమిది సేవలను టాటా స్కై ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్‌లో అందిస్తోంది.

వాట్సాప్ మెసేజ్:
 

వాట్సాప్ మెసేజ్:

టాటా స్కై యొక్క అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి టాటా స్కై బిజినెస్ అకౌంట్ కు ‘బ్యాలెన్స్' అని మెసేజ్ పంపండి . ఈ మెసేజ్ పంపిన తరువాత టాటా స్కై అకౌంట్ మీ అకౌంట్ బ్యాలెన్స్‌తో ప్రత్యుత్తరం ఇస్తుంది. మీరు మీ రిజిస్టర్డ్ టాటా స్కై మొబైల్ నంబర్ నుండి మాత్రమే వాట్సాప్ మెసేజ్ పంపితే ఈ ఆదేశాలు పనిచేస్తాయి. మీరు నమోదు చేయని మొబైల్ నంబర్ నుండి పంపితే అప్పుడు సమాధానం మీ మొబైల్ నంబర్ మాతో నమోదు చేయబడనందున అభ్యర్థన విఫలమైంది సమాచారం పొందటానికి దయచేసి నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి మళ్ళీ ప్రయత్నించండి లేదా మీ చందాదారుల ఐడిని అందించండి అని మెసేజ్ వస్తుంది.

టాటా స్కై వాట్సాప్ సర్వీస్ కు నమోదు చేయడానికి ఇతర మార్గాలు:

టాటా స్కై వాట్సాప్ సర్వీస్ కు నమోదు చేయడానికి ఇతర మార్గాలు:

టాటా స్కై తన వినియోగదారులను మూడు విధాలుగా వాట్సాప్ సర్వీస్ లో నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది. మొబైల్ నంబర్‌ను సేవ్ చేసి SMS పంపడం ద్వారా మొదటి మార్గం పైన వివరించబడింది. రిజిస్ట్రేషన్‌కు మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి టాటా స్కై చందాదారులు 92296-92296 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. తద్వారా కంపెనీ మీ అకౌంట్ కు సంబంధించిన అప్డేట్ లను పంపడం ప్రారంభించవచ్చు. చివరిగా మూడవ మార్గం టాటా స్కై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి టెక్స్ట్ మెసేజ్ ను WHATSAPP ఇలా రాసి 56633 కు పంపడం.

సర్వీస్ స్టాప్ చేయడానికి:

సర్వీస్ స్టాప్ చేయడానికి:

టాటా స్కై వినియోగదారులను ఎప్పుడైనా ఈ సేవను ప్రారంభించడానికి మరియు ఆపడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ సేవను ఆపడానికి ‘స్టాప్' అని టైప్ చేసి టాటా స్కై బిజినెస్ అకౌంట్ కు పంపండి. మరలా సేవను ప్రారంభించడానికి పైన పేర్కొన్న మూడు విధానాలలో దేనినైనా అనుసరించండి. టాటా స్కై తన వినియోగదారులకు అందించే ప్రత్యేకమైన సేవల్లో ఇది ఒకటి. ప్రత్యామ్నాయంగా టాటా స్కై వినియోగదారులు ఈ చర్యలన్నింటినీ చేయడానికి మొబైల్ యాప్ లోకి లాగిన్ అవ్వవచ్చు పైగా దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Find Tata Sky Account Balance & Channel Pack Details Through WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X