మీ జీ మెయిల్‌లో స్టోరేజ్ సమస్యతో సతమతమవుతున్నారా ?

  ఈ-మెయిల్ సర్వీసులన్నింటిలో ప్రధమ స్థానoలో ఉన్న మెయిల్ క్లయింట్ జీ మెయిల్. ఇందులో సందేహమే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్స్ లో అధిక శాతం జీ మెయిల్ వినియోగదారులే. ఎన్నో రకాల ఫీచర్లతో ప్రధమ స్థానాన్ని పొందిన జీ మెయిల్ లో సాధారణంగా ప్రతి వినియోగదారుడు ఎదుర్కుంటున్న ఒకే ఒక్క సమస్య స్టోరేజ్ సమస్య. జీ మెయిల్ సాధారణంగా ప్రతి వినియోగదారునికి 15 జి‌బి స్టోరేజ్ కేటాయిస్తుంది. కానీ ఇది కేవలం మెయిల్ తోనే కాకుండా, గూగుల్ డ్రైవ్, ఫోటోస్ తో సహా సింక్ అయి ఉంటుంది. దీనికారణంగా సఈ 15 జి‌బి స్టోరేజ్ అయిపోగానే మెయిల్ వినియోగానికై వినియోగదారుడు అధిక స్టోరేజ్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ కోసం డబ్బులు కట్టడానికే రెడీ అయ్యే పనైతే ఒకసారి ఈ వ్యాసం చదివిన తర్వాత నిర్ణయానికి రండి. మీ తక్కువ స్టోరేజ్ ను నియంత్రించుకొనుటకు మేము కొన్ని పద్దతులను పొందుపరచడం జరిగినది.

   

  మొబైల్ మార్కెట్లో హువాయి హల్‌చల్, మళ్లీ 3 కొత్త ఫోన్లతో ఎంట్రీ

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  steps

  1)మీ జీమెయిల్ అకౌంట్ ను యూసర్ నేమ్, పాస్ వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి.

  2)పేజీలో కిందికి స్క్రోల్ డౌన్ చేసి, "how much storage you have used" దగ్గర manage పై క్లిక్ చేయండి.

  3)Manage పై క్లిక్ చేశాక మీరు నేరుగా గూగుల్ డ్రైవ్ లోనికి అనుమతిని ఇస్తుంది.ఇక్కడ pie చార్ట్ నందు మీరు ఏఏ సర్వీసులకు ఎంత స్టోరేజ్ వినియోగించారో కనిపిస్తుంది. మరలా ఇతర పేమెంట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి.

  4)ఇక్కడ view details పై క్లిక్ చేయండి.

  5)ఇక్కడ మీరు డ్రైవ్.ఫోటోస్, మెయిల్ కై ఎంత స్టోరేజ్ వినియోగించారో తెలుస్తుంది.

  6)తర్వాత learn more పై క్లిక్ చేయండి

   

  steps

  7)ఇక్కడ మిమ్మల్ని గూగుల్ డ్రైవ్ హెల్ప్ పేజీకి తీసుకుని వెళ్ళబడుతుంది. ఇక్కడ మీ స్టోరేజ్ నియంత్రించు పద్దతుల గురించిన వివరములు గురించిన సూచనలు పొందుపరచబడి ఉంటాయి.

  8)ఒకవేళ ట్రాష్ లో ఎక్కువ ఫైల్స్ ఉన్నట్లయితే , గూగుల్ డ్రైవ్ లోనికి వెళ్ళి ఎడమ వైపున ఉన్న ట్రాష్ వద్ద empty trash మీద క్లిక్ చేసి ఆ ఫైల్స్ అన్నిటినీ తొలగించండి. కానీ అంతకు ముందే మీరు వాటిలో ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకొనుట మంచిది.

   

  steps

  9)గూగుల్ డ్రైవ్ హెల్ప్ లో కొంచం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ option 1 : clear space అని ఉంటుంది. ఇక్కడ ఏ ఫైల్స్ ఎక్కువ స్పేస్ ఆక్రమించాయో తెలుస్కునే వీలు ఉంటుంది. తద్వారా ఆ ఫైల్ ని ఉంచాలా తీసేయ్యాలా అన్న నిర్ణయం మీరు తీసుకోవలసి ఉంటుంది. https://support.google.com/drive/answer/6374270#drive_space

  10)ఒకవేళ ఫోటోస్ ఎక్కువ స్టోరేజ్ తీసుకున్న ఎడల క్వాలిటీని అడ్జస్ట్ చేయడం ద్వారా ఎక్కువ స్పేస్ తిరిగి పొందే వీలు కూడా ఈ పేజీలో కల్పించబడినది. లేదా మీకు అవసరంలేనివి తొలగించుకునే విధానాన్ని కూడా వివరిస్తుంది.

   

  steps

  11)ట్రాష్ , స్పామ్ ఫోల్డర్స్ ను తొలగించడం కూడా ముఖ్యమే, ఇవి కూడా ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. మీకు అవసరంలేని ఈ మెయిల్స్ ను ఎప్పటికప్పుడు తొలగించుట కూడా మంచిదే. మరియు గూగుల్ డ్రైవ్ హెల్ప్ లో option 1 : clear space సెక్షన్ లో జీమెయిల్ నియంత్రించు పద్దతులను పొందుపరచి ఉంటుంది. తద్వారా మీరు కోల్పోయిన స్టోరేజ్ ను తిరిగి పొందే సౌలభ్యం ఉంది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Gmail is undoubtedly one of the most used email service today. And while most of us may find it indispensable and immensely useful, there is one problem that mostly everyone
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more