కంప్యూటర్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకోవటం ఎలా..?

కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ ముందు కూర్చొని ముఖ్యమైన వర్క్ చేస్తునపుడు కాల్స్ రిసీవ్ చేసుకునే టైమ్ కూడా మనకు ఉండదు.

|

కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ ముందు కూర్చొని ముఖ్యమైన వర్క్ చేస్తునపుడు కాల్స్ రిసీవ్ చేసుకునే టైమ్ కూడా మనకు ఉండదు. అటువంటి సందర్భాల్లో ఫోన్ కాల్స్ కూడా కంప్యూటర్ నుంచే రిసీవ్ చేసుకునే వీలుంటే బాగుండనిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించే వారికోసం పలు థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ఇంటర్నెట్‌లో సిద్ధంగా ఉన్నాయి.

నేరుగా విండోస్ కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు..

నేరుగా విండోస్ కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు..

ఈ టూల్స్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వచ్చే కాల్స్‌ను నేరుగా విండోస్ కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్ విండోస్ కంప్యూటర్‌ను ఓ రిమోట్ డయలర్‌లా మార్చేసి కాల్స్ ఇంకా మెసేజెస్‌ను మేనేజ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు కూడా మీ విండోస్ పీసీని రిమోట్ డయలర్‌లా మార్చి ఫోన్ కాల్స్ మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

కాల్స్ లాగ్స్ అన్నీ పీసీలోకి సింక్ అయి పోతాయి..

కాల్స్ లాగ్స్ అన్నీ పీసీలోకి సింక్ అయి పోతాయి..

మీ మీ విండోస్ పీసీల్లో కాల్ సెంటర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా నేరుగా మీ కంప్యూటర్ నుంచి ఫోన్ కాల్స్ ఇంకా ఎస్ఎంఎస్‌లను సెండ్ చేసుకునే వీలుంటుంది. ఈ విధమైన ఇంటిగ్రేషన్ ద్వారా మీ ఫోన్‌లోని కాల్స్ లాగ్స్ అన్ని పీసీలో సింక్ అయి పోతాయి. దీంతో మీ వర్క్ మరింత సులువైపోతుంది. కాల్ సెంటర్ వ్యవస్థను మీ కంప్యూటర్‌లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా చూకూరే ప్రయోజనాలు..

కాల్ సెంటర్ ద్వారా చేకూరే ప్రయోజనాలు..

కాల్ సెంటర్ ద్వారా చేకూరే ప్రయోజనాలు..

ఫోన్‌లోని అన్ని కాంటాక్ట్స్ కంప్యూటర్‌లో చూపించబడతాయి. ఇదే సమయంలో కాల్ లాగ్ కూడా సింక్ అవుతుంది. కాల్స్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లను చదవొచ్చు, పంపొచ్చు. కావల్సిన కాంటాక్ట్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ఆడియో సెట్టింగ్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్మింగ్ కాల్స్ ఇంకా మేసేజ్‌లకు సంబంధించి పాపప్స్ వస్తాయి. క్లిప్‌బోర్డ్ నుంచే డయలింగ్ నెంబర్స్ పొందేందుకు ప్రత్యేకమైన హాట్ కీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఇన్‌కమ్మింగ్ కాల్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు కూడా ఓ ప్రత్యేకమైన హాట్‌కీని సెటప్ చేసుకోవచ్చు.

 

 

కాల్ సెంటర్ వ్యవస్థను ఏ విధంగా సెటప్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కాల్ సెంటర్ వ్యవస్థను ఏ విధంగా సెటప్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో Remote Phone Call అనే కూల్ యాప్ ను డౌన్ లోడ్ చేసకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ట్రెయిల్ వెర్షన్ క్రింద ఈ యాప్ 15 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఆ తరువాత నుంచి పెయిడ్ వెర్షన్ లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయిన తరువాత మీ కంప్యూటర్‌లో CallCentre అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

 

 

ఐపీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయటం ద్వారా..

ఐపీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయటం ద్వారా..

రెండు డివైసుల్లో యాప్ ఇన్‌స్టాలేషన్ విజయవంతంగా పూర్తయిన తరువాత లాంచ్ చేయాలి. మీ మొబైల్ ఫోన్‌లోని రిమోట్ కాల్ యాప్ లాంచ్ అయిన వెంటనే డివైస్ ఐపీ అడ్రస్ ఇంకా పాస్‌వర్డ్‌లు కనిపిస్తాయి. ఈ వివరాలను ఓ పేపర్ పై రాసుకోండి. ఇప్పుడు కంప్యూటర్‌లోని కాల్ సెంటర్ యాప్‌లోకి వెళ్లి యాడ్ వై-ఫై డివైస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పేపర్ పై రాసి ఉంచిన ఐపీ అడ్రస్ వివరాలను అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నెట్‌వర్క్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను కూడా ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

 

 

ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే..

ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే..

ఈ సింకింగ్ ప్రాసెస్ విజయవంతమైన వెంటనే మీ నెట్‌వర్క్‌కు సంబంధించిన నాలుగు అంకెల ఓటీపీ ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్‌కు వస్తుంది. ఈ ఓటీపీ కోడ్‌ను విండోస్ టూల్‌లో ఎంటర్ చేసినట్లయితే మీ ఫోన్ పీసీకి కనెక్ట్ అయిపోతుంది. ఆ తరువాత నుంచి నేరుగా మీ కంప్యూటర్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

 

 

 

Best Mobiles in India

English summary
How To Receive And Make Android Call On Windows PC.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X