3జీ డేటా ఫాస్ట్‌గా రన్ కావాలంటే..

Written By:

ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు మనం బ్రౌజింగ్ చేయాలన్నా లేకుంటే ఏదైనా డౌన్‌లోడ్ చేయాలన్నా చాలా చిరాకేస్తూ ఉంటుంది. అదీ 3జీ కనెక్షన్‌లో ఇంటర్నెట్ స్లోగా ఉంటే మనకి ఇంటర్నెట్ మీద ఎనలేని కోపం వస్తూ ఉంటుంది. అయితే 3జీలో కూడా మీరు ఇంటర్నెట్ ఫాస్ట్‌గా రన్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు..అవేంటో ఓ సారి చూద్దాం.

ఐఫోన్ ఎస్ఈకి సవాల్ విసురుతున్న ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డౌన్‌లోడ్ రైట్ బ్రౌజర్

మీ మొబైల్‌లో బ్రౌజర్ మంచిది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడున్న బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్ బెస్ట్ బ్రౌజర్. ఇందులో పాస్‌వర్డ్స్ ,బుక్‌మార్క్స్ అన్నీ ఉంటాయి. దీని తర్వాత ఒపేరా మ్యాక్స్ బ్రౌజర్. ఇది వీపీఎన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో మీరు సోషల్ మీడియాకి సంబంధించిన డేటాని కూడా సేవ్ చేసుకోవచ్చు.

డిసేబుల్ ఇమేజ్ బ్రౌజర్

మీ బ్రౌజర్‌లో ఇమేజ్‌ని డిజేబుల్ చేయండి. కేవలం టెక్ట్స్ మోడ్‌లో మాత్రమే పెట్టుకోండి. ఇది మీకు సెట్టింగ్స్‌లో కెళితే కనిపిస్తుంది. ఇమేజ్‌స్ డిజేబుల్ చేయడం ద్వారా కూడా నెట్ కొంత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.

క్లియర్ క్యాచీ

ఎప్పటికప్పుడు క్లియర్ క్యాచీ చేసుకోవడం ద్వారా మీ మొబైల్ డేటా కొంచెం స్పీడ్ అవుతుంది. క్యాచీ ఉంటే బ్యాక్ గ్రౌండ్‌లో ఫైల్స్ రన్ అవుతుతుంటాయి. తద్వారా మొబైల్ డేటా స్లో అయ్యే అవకాశం ఉంటుంది.

డిలీట్ యాప్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో యాప్స్ ఉన్నాయి. అయితే అన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకుంటూ పోతే మొబైల్ డేటా అసలుకే పనిచేయదు. కాబట్టి అవసరమైనవి మాత్రమై డౌన్‌లోడ్ చేసుకోండి.

డేటా వాడకం

డేటాని వీలయినంత పరిమితంగా వాడండి. యూ ట్యూబ్ వీడియోలు చూస్తే మీ డేటా ఇట్టే లేచిపోతుంది. కాబట్టి ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే వైఫై ఉన్నప్పుడు చూసుకోండి. బ్రౌజింగ్ కి మాత్రమే డేటాని వాడుకోవడం ఉత్తమం.

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
How to speed up your 3G connection read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting