మీ ఫోన్‌కి సిగ్నల్ సరిగా అందడం లేదా..?

Written By:

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ల వాడ‌కం అనేది చాలా ఎక్కువైపోయింది. దీంతో అందరికీ నెట్‌వ‌ర్క్‌ అనేది పెద్ద సమస్యగా తయారయ్యింది. కాల్స్‌ క‌ల‌వ‌క‌పోవ‌డం, ఒక వేళ క‌లిసినా వెంట‌నే డ్రాప్ అవ‌డం, మాట్లాడుతూ ఉండ‌గానే సిగ్న‌ల్ స‌రిగ్గా అంద‌క కాల్ కట్ అవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌వ‌ర్క్ వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ కోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం ఓ సారి చూడండి.

అదిరే ఫీచర్లు, దుమ్ము రేపే కెమెరా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివైస్‌ను ఆఫ్ చేసి మ‌ళ్లీ ఆన్ ..

మీ ఫోన్‌లో సిగ్న‌ల్ స‌మ‌స్య‌గా ఉంటే ఒక సారి డివైస్‌ను ఆఫ్ చేసి మ‌ళ్లీ ఆన్ చేయండి. దీంతో ఫోన్ కొత్త ట‌వ‌ర్ సిగ్న‌ల్ కోసం వెదుకుతుంది. ఈ క్ర‌మంలో సిగ్న‌ల్ కొంత మెరుగ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

బ్యాట‌రీ త‌క్కువ‌గా ఉన్నా

మీ ఫోన్‌లో బ్యాట‌రీ త‌క్కువ‌గా ఉన్నా సిగ్న‌ల్ త‌క్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి బ్యాట‌రీ త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఫోన్‌ను చార్జింగ్ పెట్టాలి. లేదంటే సిగ్న‌ల్ త‌క్కువ‌గా వ‌స్తుంది. అయితే చార్జింగ్ అందుబాటులో లేక‌పోతే ఫోన్‌లో ఉన్న బ్యాట‌రీ సేవింగ్ మోడ్‌ల‌ను ఆఫ్ చేయాలి. దీంతో సిగ్న‌ల్ పెరుగుతుంది. కాల్స్ చేసుకోగానే మ‌ళ్లీ బ్యాట‌రీ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయాలి.

రెండు ప్ర‌దేశాల‌ను వీలైనంత వ‌ర‌కు

సాధార‌ణంగా ఏ ఫోన్‌కైనా దాని సిగ్న‌ల్ యాంటెన్నా వెనుక భాగంలో పైన ఉంటుంది. కొన్నింటికి వెనుక భాగంలో దిగువ‌న ఉంటుంది. క‌నుక ఈ రెండు ప్ర‌దేశాల‌ను వీలైనంత వ‌ర‌కు చేతులతో క‌వ‌ర్ చేయ‌కూడ‌దు. ఓపెన్‌గా ఉంచి, మిగ‌తా ప్రాంతంలో ఫోన్‌ను ప‌ట్టుకోవాలి. దీంతో ఫోన్‌కు సిగ్న‌ల్ స‌రిగ్గా అందుతుంది.

ఓపెన్ ప్ర‌దేశంలో ఉండి కాల్స్ చేసుకోవ‌డానికి

నాలుగు గోడ‌లు, బిల్డింగ్‌లు, చెట్లు ఎక్కువగా ఉన్న‌ప్పుడు వాటి మ‌ధ్య సిగ్న‌ల్ త‌క్కువ‌గా వ‌స్తుంది. క‌నుక వీలైనంత వ‌ర‌కు ఓపెన్ ప్ర‌దేశంలో ఉండి కాల్స్ చేసుకోవ‌డానికి య‌త్నించండి. బిల్డింగ్‌లైతే వాటి పైకి వెళ్తే సిగ్న‌ల్ ఎక్కువ‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

అటు, ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతుంటే

ఒకే ద‌గ్గ‌ర నిల‌బ‌డి ఉండి మాట్లాడ‌డం క‌న్నా, అటు, ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతుంటే దాంతో సిగ్న‌ల్ పెరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
No signal? 5 simple tricks to help you get better mobile connectivity read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot