అదిరే ఫీచర్లు, దుమ్ము రేపే కెమెరా..

Written By:

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ ఎ 57 ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 3 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఒప్పో స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ద్వారా విక్రయించనున్నారు. ఈ ఫోన్‌లో అతి పెద్ద బ్యాటరీని పొందుపరిచారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకచ్చినట్లు కంపెనీవైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ స్కై లీ చెప్పారు.

హువాయి P10 Lite ధర లీకయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5.2 ఇంచ్ హెచ్డీ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. బరువు 147 గ్రాములు. ఫ్రింగర్ ప్రింట్ రీడర్ అదనపు ఆకర్షణ.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.అతి తక్కువ లైటింగ్ కండిషన్స్ లో అద్భుతమైన ఫోటోలను తీయడం ఈ ఫోన్ ప్రత్యేకత

అదనపు ఆకర్షణలు

ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, సోనీ ఐఎంఎక్స్ 258 సెన్సార్, 0.1 సెకండ్లో అల్ట్రా-హెచ్ డి ఆటో ఫోకస్, గొరిల్లా గ్లాస్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

మొబైల్ ధర

ఫిబ్రవరి3నుంచి ఇండియాలో దీని అమ్మకాలు ప్రారంబమవుతాయి. ఈ ఫ్లాగ్ షిప్‌ మొబైల్ ధరను కంపెనీ రూ. 14,990గా నిర్ణయించింది. ఒప్పో స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ద్వారా విక్రయించనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Oppo launches A57 with 16MP front camera at Rs 14,990 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot