నడిసముద్రంలో విమానాలు దించుతాం: బరితెగించిన చైనా

Written By:

దక్షిణ చైనా సముద్రంలో రోజు రోజుకు యుద్ధం మరింత వేడెక్కుతోంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కులు తమవేనని, అందులో అంగుళం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చైనా బల్లగుద్దీ మరి చెబుతోంది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు హక్కులు లేవంటూ అంతర్జాతీయ ఆర్బిట్రల్‌ ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో చైనా ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది తమ సార్వభౌమత్వానికి సంబందించిన అంశమని, ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదిలేదని చైనా చెప్పడంతో మిగతా దేశాలు ఇప్పుడు అలర్టయ్యే పరిస్థితి వచ్చింది.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

దీనిక తోడు సైనిక విన్యాసాల్లో భాగంగా సముద్రంలో కొంత భాగాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించడంతో ఇంకా వేడి రాజుకుంది. ఇప్పటికే అక్కడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పేరుతో నడి సముద్రంలో విమానాలను దింపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. తాను ఇలాంటివి ఇక నిర్మించబోనని చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కింది. అమెరికా శాటిలైట్ ఈ దృశ్యాలను బయటపెట్టింది.

నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాలతో దడ పుట్టిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

2002లో తాను మూడో నిర్మాణం ఏదీ తలపెట్టనని ప్రపంచ దేశాలకు చైనా హామీ ఇచ్చింది. ప్రస్తుతం మొత్తం 3వేల మీటర్ల భూమి చుట్టూ గోడ కట్టేస్తోంది. ఇక్కడ యుద్ధ విమానాల్ని మోహరించాలన్నది చైనా ప్లాన్.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

సుదీర్ఘమైన సముద్ర తీరం కలిగిన చైనా ఇప్పటికే ఇలాంటి వాటిని రెండింటిని నిర్మించుకుంది. ఆ రెండు కాకుండా మూడోదానిని ఇప్పుడు నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు ఎయిర్ స్ట్రిప్పులను ఆ వివాదాస్పద సముద్ర దీవుల్లో నిర్మించింది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

దక్షిణ చైనా సముద్రంపై చాలా దేశాలకు హక్కు ఉంది. అయితే చైనా మాత్రం దానిపై పూర్తి హక్కులను బలవంతంగా సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సముద్రం, దీని దీవుల్లో అపారమైన ఖనిజాలు, చమురు గనులు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోడానికి చైనా వేస్తున్న ప్లాన్ లో భాగమే ఇదంతా. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఈ సముద్రంపై బ్రునై, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాంలకు కూడా హక్కుంది. కానీ వాటికేమి అధికారం లేదన్నట్లుగా ఈ దీవిపై కన్నేసిన చైనా తన ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టడం వివాదస్పమవుతోంది. అక్కడున్న అన్నింటిని సొంతం చేసుకోవడానికి ఇలా వ్యవహరిస్తోందనే వాదన ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువైన దక్షిణ చైనా సముద్రంలోని దీవులు చాలానే ఉన్నాయి. వాటిలో శాన్షా దీవి ఒకటి. ఈ దీవి ఏర్పాటైంది దక్షిణ చైనా సముద్రంలోనే. చైనా దక్షిణ కొసన ఉన్న ప్రావిన్స్ నుంచి 13 గంటల పాటు కడలిలో ప్రయాణిస్తే కానీ ఈ దీవికి చేరుకోలేరు.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్న ఈ బుల్లి దీవిని గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా చైనా అక్కడ ఖనిజాలను ,గనులను వశం చేసుకునే పనిలో పడింది. అయితే ఇది వివాదాస్పదం కావడంతో కొంత వెనక్కి తగ్గింది. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఈ దీవి చైనా రిపబ్లిక్‌లో అవతరించిన కొత్త నగరం. దీని వైశాల్యం ఓ చిన్నపాటి విమానాశ్రయం(ఎయిర్ స్ట్రిప్) అంతే! కాకుంటే ఓ పోస్టాఫీస్, బ్యాంక్, సూపర్‌మార్కెట్, ఓ ఆస్పత్రిని నిర్వహించుకోవచ్చు. ఇక జనాభా చూస్తే వెయ్యే. అలాంటి చిన్న దీవిపై చైనా ఎందుకు అంతలా కన్నేసిందో అనేది అర్థం కాని విషయం. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఇదొక్కటే కాదు.. దక్షిణ చైనా సముద్రంలో ఇలాంటి చిన్న దీవులకు కొదవలేదు. చమురు నిల్వలు అపారంగా ఉన్న ఈ దీవులపై ఆధిపత్యం సాధించేందుకు చైనాతో పాటు వియత్నాం ఎప్పటి నుంచో విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఈ నేపథ్యంలో చైనా ఓ అడుగు ముందుకేసి శాన్షాకు వెంటనే కొత్త  మేయర్‌ను ప్రకటించింది. తొలి మేయర్‌గా జియోజీ ఎన్నికయ్యారు. చైనా సెంట్రల్ టెలివిజన్ దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసింది కూడా. శాన్షాలో సైనిక బలగాలను దింపినట్టు చైనా కేంద్ర మిలటరీ ప్రకటించింది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

చైనా చేసిన ఈ చర్యకు ఇతర దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాల ఉల్లంఘన కొందకే వస్తుందని వియత్నాం ఆరోపించింది. దక్షిణ చైనా సముద్ర దీవుల్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడాన్ని ఫిలిప్పీన్స్ ఖండించింది. అయినా చైనా మొండిగా ముందుకు వెళుతోంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దీర్ఘ శ్రేణి శతఘ్నులను మోహరించే యోచనలో ఉన్నట్టుగా తైవాన్ ప్రకటించడం తాజా వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆ సముద్రంలో ఎటు చూసినా శతఘ్నులే దర్శనమిచ్చేలా ఉన్నాయి. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

అమెరికాకు చెందిన CSIS సంస్థ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. వివాదాస్పద జలాల్లో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్లే అమెరికా నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

అయితే చైనా మాత్రం యధావిధిగా పనులు కొనసాగిస్తునే ఉంది. ఎవరెన్ని చెప్పినా అనుకున్నదాన్ని పూర్తి చేయకమానదు డ్రాగన్‌ కంట్రీ. తాజాగా తాను చేపట్టదలచిన ఎయిర్‌ స్ట్రిప్ నిర్మాణంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. చైనా మొండిగా ముందుకు పోతోంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

చైనాకు దక్షిణ ప్రాంతంలోని సముద్ర జలాల్లో కృత్రిమ ద్వీపం ఏర్పాటు చేసి... దానిపై దీర్ఘ చతురస్రాకారంలో దాదాపు 3 వేల మీటర్ల పొడవున ఎయిర్ స్ట్రిప్‌ నిర్మిస్తోంది. గతంలో చైనా నిర్మించిన రెండు ఎయిర్‌ స్ట్రిప్‌ల లాగే ఇదీ ఉందని అమెరికాకు చెందిన మేరీ టైమ్‌ ట్రాన్స్‌పరెన్సీ అధికారులు అంటున్నారు. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

చైనా దక్షిణ ప్రాంతంలో ఉన్న సముద్ర జలాలు వాటిలో దీవులపై సార్వభౌమాధికారం ఎవరిదనే దానిపై చైనా, బ్రూనై, మలేసియా, ఫిలిప్పైన్స్‌, తైవాన్, వియత్నాం దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా ప్రాంతంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మిచేందుకు సన్నద్దమవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

చైనా నిర్మాణ కార్యక్రమాల వల్ల అంతర్జాతీయ జలాల్లో ఇతరులు సేఫ్‌గా వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయని అంటోంది అమెరికా. ఇక సముద్ర జలాల్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్ స్ట్రిప్‌లో చైనా ఆర్మీకి చెందిన ఎలాంటి విమానమైనా అక్కడ ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేసే అవకాశం ఉంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

గతేడాది సెప్టెంబర్‌ నెల మొదటివారంలో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ వ్యవహారం బైటకు పొక్కింది. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

అయితే ఇప్పుడు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో మొబైల్ న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న చైనా ప్రయత్నాలు, ఉద్రిక్తతను మరింత పెంచుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణిని తగ్గించుకోవాలని, దక్షిణ చైనా సముద్రపు దీవులపై చైనా పెత్తనం చెల్లదని హేగ్ ఐరాస కోర్టు తీర్పిచ్చిన రోజుల తరువాత, చైనా అణు కేంద్రాల నిర్మాణం వార్తలు వెలువడటం గమనార్హం.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

సముద్రంలో తన హక్కులను కాపాడుకునేందుకే న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకున్నట్టు చైనా అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ సైతం తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ పెద్దఎత్తున తయారు చేసి, దాన్ని సముద్రపు అవసరాలు, నిఘా నిమిత్తం వాడనున్నామని, ఇవి ఎక్కడికి కావాలంటే, అక్కడికి తీసుకువెళ్లేలా ఉంటాయని తెలుస్తోంది.

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

ఇంతలా బరి తెగిస్తున్న చైనా ముందు ముందు ఇంకెతలా బరి తెగిస్తుందోనని మొత్తం సముద్రాన్ని కబ్జా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆ భూభాగం మాదే..నడిసముద్రంలో విమానాలు దించుతాం: చైనా

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write China may build 20 mobile nuclear power plants in the South China Sea
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot