మొబైల్ ఫోన్‌లు.. బైర్లుగమ్మే నిజాలు

ఇటికిరాయి పరిమాణంతో ప్రారంభమైన మొబైల్ ఫోన్ ప్రస్థానం అరచేతిలో ఇమిడిపోయేంత స్థాయి వరకు విస్తరించింది. మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తించిన 15 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం....

Read More : రూ.2,999కే 4G VoLTE ఫోన్.. Jio సిమ్ యాక్టివేషన్‌తో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

#2

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న వారిలో సగటు మనిషి రోజుకు 110 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది.

#3

ప్రపంచవ్యాప్తంగా మరుగుదొడ్లు కంటే మొబైల్ ఫోన్‌లే ఎక్కువ

#4

బ్రిటన్‌లో సంవత్సరానికి లక్ష ఫోన్‌లు టాయ్‌లెట్‌లలో జారవిడచబడుతున్నాయి.

#5

ప్రస్తుత మొబైల్ ఫోన్‌‌లలో ఉన్న కంప్యూటింగ్ పవర్ అపోలో 11 మూన్ ల్యాండింగ్‌లో ఉపయోగించిన కంప్యూటర్ పవర్ కంటే ఎక్కువ.

#6

ప్రపంచవ్యాప్తంగా నోకియా 1100 డివైస్‌ల అమ్మకాలు 250 మిలియన్ మార్క్‌ను దాటాయి.

#7

శాస్త్రవేత్తలు ఇటీవల మూత్రం ద్వారా మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసే విధానాన్ని కొనుగొన్నారు.

#8

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి ఇంకా గందరగోళం తలెత్తే అవకాశం ఉంది.

#9

జపాన్‌లో వినియోగిస్తోన్న 90 శాతం ఫోన్‌లు వాటర్ ప్రూఫ్ ఫీచర్‌ను కలిగి ఉండేవే.

#10

టాయ్‌లెట్ హ్యాండిల్స్‌తో పోలిస్తే మొబైల్ ఫోన్‌లు 18 శాతం ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.

#11

మాల్వేరు దాడులు ఎక్కువుగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల పైనే జరుగుతున్నాయి.

#12

కెమెరా ఫోన్ సృష్టికర్త ఫిలిప్పి ఖాన్ తన ఫోటోను జూన్11, 1997ను మొదటిసారిగా తన కూతురు సోఫీ జన్మించిన మెటర్నిటీ వార్డ్‌కు ఫోన్ ద్వారా షేర్ చేశారు. అప్పటి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

#13

తొలిసారిగా మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 1983లో యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. ఒక్కో ఫోన్ ధర రూ 4,000 డాలర్లు.

#14

45ఏళ్ల సమాచార పరిశోధకుడు ఫ్రైడ్ హిల్మ్ హిల్లీబ్రాండ్ 1985వ సంవత్సరంలో మొబైల్ టెక్స్ట్ సందేశానికి సంబంధించి ప్రామాణిక పొడవును వివరించారు. తొనినాళ్లలో సాంకేతిక లోపాల కారనంగా టెక్స్ట్ సందేశం పొడవు 128 పదాలకు మించేది కాదు. తరువాతి క్రమంలో లోపాలను సవరించి టెక్స్ట్ సందేశం పొడవును 160 పదాలకు పెంచారు.

#15

ప్రపంచపు తొలి చేతి వినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్' (DynaTAC 8000X)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
15 curious cell phone facts Telugu. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot