ఈ ఏడాది రాబోతున్న అత్యంత ఖరీదైన ఫోన్లు ఇవే!

Written By:

ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న అత్యంత ఖరీదైన ఫోన్లు గురించి తెలుసా..శాంసగ్, ఆపిల్, గూగుల్ కంపెనీల ఫోన్లు ఈ ఏడాది మార్కెట్లో అత్యంత ఖరీదైన ఫోన్లుగా నిలవనున్నాయి. శాంసంగ్‌కు సంబంధించిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్, ఆపిల్‌కు సంబంధించిన ఐఫోన్ 8, 8ప్లస్ అలాగే గూగుల్‌కి సంబంధించి ఫిక్సల్ 2 ఫోన్లు ఈ ఏడాది మార్కెట్‌ని ముంచెత్తబోతున్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

టాయిలెట్ క్రిముల కంటే దారుణమైన క్రిములు మీ ఫోన్లో ఉన్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8

శాంసంగ్ నుంచి రాబోతున్న గెలాక్సీ ఎస్8కి సంబంధించి ధర లీకయింది. ఆపిల్ ఐఫోన్ 8 ధీటుగానే ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ధర 950 డాలర్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ ధర 1050 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో వరుసగా రూ. 63,407, రూ. 70082 గా ఉంటుందని అంచనా. బ్లాక్, గోల్డ్, ఆర్కిడ్ గ్రే కలర్స్ లో ఈ ఫోన్ రావచ్చని అంచనా.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8

గెలాక్సీ ఎస్ 8 5.8 ఇంచ్ QHD+ Super AMOLED డిస్‌ప్లేతోనూ, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ 6.2 ఇంచ్ QHD+ Super AMOLED డిస్‌ప్లే తోనూ రానుంది. 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ,మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించుకునే సామర్థ్యం. 12 ఎంపీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ షూటర్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్835 ప్రాసెసర్ తో ఈ ఫోన్లు రానున్నాయి.

ఆపిల్ ఐపోన్ 8

ఐఫోన్ 8 మునుపెన్నడూ రాని న్యూ డిజైన్ తో వస్తోంది. ఐఫోన్ 8 సరికొత్తగా 5.8ఇంచ్ OLED డిస్‌ప్లేతో ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టనుంది. కెమెరాను కూడా అధునాతన హంగులతో తయారుచేసి వదలనుందని సమాచారం. దీని ధర 1200 డాలర్లు ఉండే అవకాశం ఉంది. అదే ఇండియన్ కరెన్సీలో రూ. 80000 వేలు ఉంటుందని అంచనా

గూగుల్ ఫిక్సల్ 2

గూగుల్ ఫిక్సల్ ఫోన్ విజయివంతమైన నేపథ్యంలో గూగుల్ మళ్లీ దాన్ని 2గా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఆపిల్ , శాంసంగ్ కంపెనీలకు పోటీగా గూగుల్ ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. ఫోటోగ్రఫీ విషయంలో ఈ ఫోన్ దుమ్మురేపనున్నట్లుగా వార్తలు అప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. దీని ధర 1000 డాలర్లకు పైమాటే. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 67 వేలకు పైగానే ఉంటుందని అంచనా.

లోకాస్ట్ హీరోలు

ఇక బడ్జెట్ ధరల్లో ఈ ఏడాది వన్ ప్లస్, షియోమి, వివో, హువాయి లాంటి కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనున్నాయి. అన్ని ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో ఈఫోన్లు రానున్నాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
2017 Google, Apple, Samsung flagships will be very expensive read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot