రూ. 18 వేల శాంసంగ్ జె7 ఫోన్ రూ. 3 వేలకే, మీకు కాల్ వచ్చిందా..?

Written By:

ఈ దేశంలో మోసపోయే వారు ఉంటే చేసేవారు పుడుతూనే ఉంటారన్నది పచ్చినిజం. అమాయకులను టార్గెట్ చేస్తూ వారిని మాయమాటలతో బురిడీ కొట్టించేవారు చాలామందే తయారయ్యారు. ఇలా మోసపోయిన వాళ్లు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కేసులతో పోలీసులే అవాక్కవుతున్నారంటే నమ్మండి.

దిగ్గజాలకు షాక్..ఆపిల్ నుంచి డ్యూయెల్ సిమ్ ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమాయకులను టార్గెట్ చేస్తూ

రూ. 18 వేల రూపాయలు విలువచేసే శాంసంగ్ జె7 ఫోన్ కేవలం రూ. 3 వేలకే మీకు అందిస్తామంటూ ఈ మధ్య కాల్స్ తెగ ఎక్కువవుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ అందమైన అమ్మాయిలతో మాట్లాడించి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క హైదరాబాద్‌లోనే

వీరి భారీన పడిన వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. రోజు రోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ సంఖ్య సిటీల్లోనే ఎక్కువగా ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే గత మూడు రోజుల్లో ఏకంగా పదిమంది బాధితులు సైబర్ క్రైమ్ స్టేషన్ను ఆశ్రయించడం చూస్తుంటే మోసం ఏ రేంజ్లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 80 శాతానికి పైగా గ్రామీణులే

హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తూ తమ వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే మోసపోయిన వారిలో ఎక్కువ మంది అంటే దాదాపు 80 శాతానికి పైగా గ్రామీణులేనని తెలుస్తోంది.

పార్సిల్ అందుకున్న వారికి ఫోన్ చేస్తే

డబ్బు కట్టాక అందుకున్న పార్శిళ్లలో బొమ్మలు, చెత్తలాంటివి ఉండడంతో 'బుక్' చేసుకున్నవారు లబోదిబోమంటున్నారు. ఇక ఆ పార్సిల్ అందుకున్న వారికి ఫోన్ చేస్తే అప్పటిదాకా బాగా మట్లాడిన వారు ఎదురుతిరిగి మాట్లాడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఆన్ లైన్ కంప్లయిట్ బోర్డులో సైతం కొన్ని వేలమంది తాము మోసాపోయామంటూ మెసేజ్ లు కూడా పెట్టారు.

చాలా జాగ్రత్తగా ఉండాలని

ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలని, స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మోసపోయిన వారు తమను సంప్రదించాలని చెబుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beware of fake offer of Samsung J7 promotion scheme read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot