నోకియా ఫోన్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!

Posted By: Super

నోకియా ఫోన్ కొంటే  ఆఫర్లే.. ఆఫర్లు!

 

రాబోయే దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని విశ్వసనీయ బ్రాండ్ నోకియా.. తన లూమియా, ఆషా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్ల పై వివిధ ఉచిత బహుమతులను అందించనుంది. వివరాల్లోకి వెళితే..... ‘సెలబ్రేట్ హోలి దిస్ దివాళీ విత్ నోకియా’ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి నోకియా తెర లేపింది. ఈ ఆఫర్‌లలో భాగంగా కొనుగోలుదారు లూమియా 900 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై రూ.5,570 విలువ చేసే నోకియా జే బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. మరో ఆఫర్‌లో భాగంగా లూమియా 800 కొనుగోలు పై రూ.5,110 విలువ చేసే నోకియా ప్యూరిటీ స్టీరియో హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.

మరో లూమియా సిరీస్ ఫోన్ లూమియా 710 కొనుగోలు పై రూ.2,110 విలువ చేసే బీహెచ్-111 బ్లూటూత్ స్టీరియో హెడ్‌సెట్‌ను నోకియా ఉచితంగా అందిస్తోంది. మరో ఫోన్ లూమియా 610 కొనుగోలు పై రూ.1,499 విలువ చేసే ఫిలిప్స్ హెడ్‌సెట్‌ను యూజర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ నవంబర్ 20తో ముగుస్తుందని నోకియా వర్గాలు ప్రకటించాయి. మరో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యాత్రా డాట్ కామ్‌తో జతకట్టిన నోకియా ఆషా సిరీస్ 305,308, 311 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత ప్రయాణ వోచర్‌లను అందించనుంది. ఈ వోచర్ విలువ రూ.4,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot