6జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే, చేతికి చిక్కేనా !

Written By:

గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల తరువాత శాంసంగ్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొబైల్స్‌ను తీసుకురావాలని భావిస్తోంది, అందులో భాగంగా Galaxy C9 Pro ను ముందుగా ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. శాంసంగ్ కంపెనీ ఈ నెల 24 నుంచి Galaxy C9 Pro హ్యాండ్‌సెట్‌ను షిప్పింగ్ చేస్తామని ప్రామిస్ చేసింది. అంటే వచ్చే వారం నుంచే దీని షిప్పింగ్ ఉండాలి. అయితే ఇది మార్చి 3కు వాయిదా పడింది. మార్చి 3 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. కంపెనీ ప్రీ ఆర్డర్స్ లో Galaxy C9 Pro అమ్మకాలను కొనసాగించనుంది. రెండు వేరియంట్లలో రానున్న ఈ ఫోన్ ధర రూ 36,900గా కంపెనీ డిసైడ్ చేసింది.

జియో వ్యూహాత్మక స్కెచ్ , ఆఫర్లే ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

12నెలల పాటు శాంసంగ్ వారంటీ

బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ పై కంపెనీ 12నెలల పాటు శాంసంగ్ వారంటీని ఇస్తోంది. అంతే కాకుండా ఈ ఫోన్ పై కంపెనీ ఈఎమ్ఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకు కార్డులకు ఇది వర్తిస్తుంది.

6ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే

6ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే విత్ పుల్ హెచ్ డి రిజల్యూషన్ తో ఫోన్ రానుంది. స్నాప్ డ్రాగన్ 653 SoC మీద పోన్ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో. Non-removable Li-Ion 4000 mAh battery.

6 జిబి ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 6 జిబి ర్యామ్ ను కలిగి ఉంది. 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్టీ ద్వారా మెమొరీని విస్తరించుకునే సామర్థ్యం ఉంది.

16 ఎంపీ కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 ఎంపీ కెమెరాతో నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు. దీంతో పాటు 16 ఎంపీ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. అదిరే క్వాలిటితో ఫోటోలు వస్తాయని కంపెనీ చెబుతోంది.

మార్చి 3 నుంచి ప్రీ ఆర్డర్స్

మార్చి 3 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం. ధర రూ. 36, 900. గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల తరువాత శాంసంగ్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫోన్ ను తీసుకొస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India: Samsung Galaxy C9 Pro Shipping Date for Pre-orders Moved to March 3 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot