జియో వ్యూహాత్మక స్కెచ్ , ఆఫర్లే ఆఫర్లు

Written By:

ఉచిత డేటా, వాయిస్ సేవలతో టెల్కోలకు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో జియో చేతులు కలిపింది. జియో యూజర్లు ఇకపై రిలయన్స్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌కి చెందిన ప్రీపెయిడ్‌ వాలెట్‌ జియోమనీ యాప్‌ ద్వారా ఉబెర్‌ ట్యాక్సీలను బుక్‌ చేసుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది.

3జీ డేటా ఫాస్ట్‌గా రన్ కావాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉబెర్‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని..

జియో తన చెల్లింపుల యాప్ ద్వారా టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో కష్టమర్లు ఇకపై ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

జియో మనీ ఆప్‌ ద్వారా..

ఉబెర్ రైడ్‌లకు గాను, ప్రీ పెయిడ్‌ జియో మనీ ఆప్‌ ద్వారా చెల్లింపులను త్వరలోనే తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.

ఏకీకరణ డిజిటల్ ప్లాట్ ఫాంకు..

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశంలో అతిపెద్ద యూజర్‌ బేస్‌ ఉన్న రెండు సంస్థలకు ఏకీకరణ డిజిటల్ ప్లాట్ ఫాంకు తెరతీసినట్టు ఉబెర్‌ బిజినెస్ హెడ్ మధు కన్నన్‌ చెప్పారు.

ప్రత్యేక ప్రోత్సాహకాలు

జియోమనీ ద్వారా ఉబెర్‌ ట్యాక్సీ సేవలకు చెల్లింపులు జరిపేవారికి ఇరు సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జియోమనీ బిజినెస్‌ హెడ్‌ అనిర్బన్‌ ముఖర్జీ తెలిపారు.

మెరుగైన డిజిటల్‌ సర్వీసులు

జియో, ఉబెర్‌ ద్వారా వినియోగదారులకు వివిధ కాంప్లిమెంటరీ ప్రోగ్రాముల ద్వారా అనేక అవకాశాలను కల్పించనున్నామన్నారు. దేశీ యూజర్లకు మరింత మెరుగైన డిజిటల్‌ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్‌ నూతన చీఫ్‌ బిజనెస్‌ ఆఫీసర్‌ (భారత విభాగం) మధు కన్నన్‌ ఆశాభావం వ్యక్లం చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio, Uber Announce Strategic Partnership; Starting With JioMoney Integration read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot