జియో నుంచి మరో శుభవార్త, కొందరికి మాత్రమే !

By Hazarath
|

దేశీయ టెల్కో రంగంలో దిగ్గజాలను మట్టి కరిపించిన జియో తన ఫీచర్ ఫోన్‌తో మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చి రాగానే ఆ ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరడంతో జియో సైటు క్రాష్ అయింది కూడా.. ఆర్డర్ల ధాటికి తట్టుకోలేని జియో ఫోన్ బుకింగ్‌లను నిలిపివేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ఫోన్ బుకింగ్‌లను ప్రారంభించింది.

 

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

జియో ఫోన్‌ బుకింగ్స్‌..

జియో ఫోన్‌ బుకింగ్స్‌..

యూజర్లకు మరో శుభవార్తను అందిస్తూ జియో ఫోన్‌ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభించింది. అయితే ఇది అందరికీ కాకుండా ఎవరైతే ఫోన్‌ కొనేందుకు ఆసక్తి కనబరిచారో వారికి మాత్రమే ఈ సారి జియో ఫోన్‌ బుక్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఆగస్టు 24న జియో ఫ్రీ ఫోన్‌కు బుకింగ్స్‌ start

ఆగస్టు 24న జియో ఫ్రీ ఫోన్‌కు బుకింగ్స్‌ start

కాగా జియో ఆగస్టు 24న జియో ఫ్రీ ఫోన్‌కు బుకింగ్స్‌ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో 60 లక్షల మంది ఈ ఫోన్‌ను బుక్‌ చేసుకున్నారు.

10 లక్షల మందికి..

10 లక్షల మందికి..

అంతకుముందు జూలైలోనే చాలా మంది తాము ఫోన్‌ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. అలా ఆసక్తి కనబరిచిన 10 లక్షల మందికి ఇప్పుడు జియో సంక్షిప్త సందేశాలను పంపుతోంది.

జియో పంపిన సందేశంలో..
 

జియో పంపిన సందేశంలో..

జియో పంపిన సందేశంలో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా గానీ, లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా గానీ ఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

బుకింగ్‌ సమయంలో రూ.500..

బుకింగ్‌ సమయంలో రూ.500..

కాగా బుకింగ్‌ సమయంలో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెస్ పూర్తి అయిన తరువాత వారికి ఎప్పుడు ఫోన్‌ను అందజేస్తారన్నది తెలియపరుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రూ.1500 డిపాజిట్‌

రూ.1500 డిపాజిట్‌

ఫ్రీ ఫోన్‌ పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు రూ.1500 డిపాజిట్‌ చెల్లించాలని తెలిసిందే. 36 నెలల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఇది వరకే కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఆ నిబంధనలను కూడా జియో సవరించింది.

ఏడాదికి కనీసం రూ.1500 రీఛార్జి

ఏడాదికి కనీసం రూ.1500 రీఛార్జి

తొలి ఏడాది ఫోన్‌ను రిటర్న్‌ చేస్తే రూ.500, రెండో ఏడాది చేస్తే రూ.1000, మూడో ఏడాది రిటర్న్‌ చేస్తే రూ.1500 కంపెనీ చెల్లిస్తుంది. అయితే, ఇందుకు గాను ఏడాదికి కనీసం రూ.1500 రీఛార్జి చేయాల్సి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jio Phone Booking Process Said to Have Been Resumed by Reliance Retail More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X